సుశాంత్‌ మృతి: 14 మంది స్టేట్‌మెంట్‌ నమోదు

Sushant Singh Rajput Demise Police Recorded 14 Members Statement - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) మృతి కేసులో ముంబై పోలీసులు 14 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సుశాంత్‌ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అతని సన్నిహితుల స్టేట్‌మెంట్లు దోహదపడతాయని పోలీసులు శనివారం చెప్పారు. కాగా, జూన్‌ 14న సుశాంత్‌ బాంద్రాలోని తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకున్న బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చనిపోయే ముందు సుశాంత్‌ ఔదర్యం!)

సుశాంత్‌ తండ్రి, అతని ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఓ స్నేహితుడు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ పితాని, మేనేజర్‌ సందీప్‌ సావంత్‌, నటుడు మహేష్‌ శెట్టీ, కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ ఛాబ్రా, బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతీ మోదీ, పీఆర్‌ఓ అంకితా తెహ్లానీ, నటుడు రియా చక్రవర్తి, తాళాలు తయారు చేసే ఓ వ్యక్తి, ఇంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు జోన్‌ 9 డీసీపీ అభిషేక్‌ త్రిముఖే తెలిపారు. కాగా, సుశాంత్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులెవరూ అతని మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదని సమాచారం.
(చదవండి: అమ్మకు తోడు)

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top