రోడ్డున్నా.. బస్సు రాదాయే!

village with no bus service - Sakshi

బస్సుల కోసం పల్లె జనం ఎదురుచూపులు 

నిజలాపూర్, పోల్కంపల్లి, చక్రాపూర్‌ ప్రజల అవస్థలు

మూసాపేట : రోడ్డు సౌకర్యం ఉన్నప్పటి కి ఆ మూడు గ్రామాలకు బస్సు సౌకర్య ం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడిపిస్తా మని అధికారులు పలు సమావేశాల్లో పేర్కొంటున్నప్పటికీ మండలంలో మా త్రం అది నోచుకోవడంలేదు. దీంతో ప్ర జలు ప్రైవేట్‌ ఆటోల్లో స్థాయికి మించి ప్రయాణం చేస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. 

బస్సుల్లేక అవస్థలు 
మండలంలోని నిజాలాపూర్, పోల్కంపల్లి,చక్రాపూర్,సూర్తి తండా,కనకాపూర్‌ తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యం లేదు. అంతేగాక, సె లవు దినం వచ్చిందంటే చక్రాపూర్‌కి వ చ్చే బస్సు సైతం బంద్‌ అవుతుంది. దీం తో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ని త్యం వందలాది మంది ప్రయాణికులు ఇటు జిల్లా, మండల కేంద్రాలతో పాటు, అటు నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రకు పలు పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కొన్నేళ్ల కిందట ఓ బస్సు జిల్లా కేంద్రం నుంచి చక్రాపూర్, లక్ష్మీపల్లి గ్రామాల మీదుగా దేవరకద్రకు చేరుకుని అటు నుంచి తిరిగి జిల్లా కేం ద్రానికి చేరుకునేది. కానీ ప్రైవే టు వా హనాల జోరు పెరగడంతో ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను రద్దు చేశారు. ఇటీవల మూడు నెలల క్రితం కొందరు గ్రామస్తుల కోరిక మేరకు బస్సు ప్రారంభమైనా.. సెలవు దినాలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ వారు కూడా సెలవు తీసుకుంటారు.

 ప్రైవేట్‌ వాహనాల్లో ప్రమాదకరంగా.. 
మండలంలోని చక్రాపూర్,సూర్తి తండా, కనకాపూర్‌ తండా తిమ్మాపూర్, పోల్కంపల్లి, తిమ్మాపూర్, తుంకినీపూర్, నిజాలాపూర్, మహ్మదుస్సేన్‌పల్లి, గ్రామాలకు కనీసం రెగ్యులర్‌గా మినీ బస్సు తిరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కానీ దాని గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో ప్రజలు ప్రైవేట్‌ ఆటోలు, జీపులలో బిక్కు బిక్కు మంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. స్థాయికి మించి ప్రైవేట్‌ ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. ఎమ్మెల్యే, జిల్లా అధికారులు స్పందించి మండలంలోని ప్రతీ గ్రామంలో ఒక మినీ బస్సు సర్వీస్‌ కొనసాగేలా చర్యలు చేపట్టి ప్రజల అవస్థలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రైవేట్‌ వాహనాలే గతి 
మా గ్రామం జాతీయ రహదారికి కేవలం 4 కి.మీ దూరం ఉన్నా మండల, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సెలవు దినాల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. పై అధికారులు స్పందించి బస్సు సర్వీస్‌ నిత్యం నడిచేలా చర్యలు చేపట్టాలి. 
–  భగవంతు, చక్రాపూర్‌

కాలినడకన వెళ్తున్నారు.. 
నేను రెండవ తరగతి చదువుకుంటున్న సమయంలో గ్రామానికి బస్సు వస్తుండేది. తర్వాత ఎందుకో సర్వీస్‌ నిలిచిపోయింది. నాటి నుంచి విద్యార్థులు కాలినడకన కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లాల్సి వస్తుంది. అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి 
– శ్రీకాంత్‌రెడ్డి, పోల్కంపల్లి 

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top