మోస్ట్‌ రొమాంటిక్‌ జంట వీరిదే.. ఎందుకంటే!..

Worlds Most Romantic Couple Marrying Every Year - Sakshi

డెన్మార్క్‌ : అన్నెత్‌, కెన్నెత్‌ లండ్‌ల జంట చాలా ప్రత్యేకమైనది! అందుకే మోస్ట్‌ రొమాంటిక్‌ జంటగా ప్రపంచ రికార్డు సాధించింది. పెళ్లి చేసుకోవటం, ఏదో కారణం చెప్పి విడిపోవటం సాధారణ జంటల పనైతే.. ఈ జంట మాత్రం ప్రతి సంవత్సరం ఒకరినొకరు పెళ్లి చేసుకుంటూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే.. డెన్మార్క్‌కు చెందిన అన్నెత్‌, కెన్నెత్‌ లండ్‌ల జంట వెడ్డింగ్‌ ప్లానింగ్‌ సైట్‌ను నడుపుతోంది. అలా వారి చేతుల మీదగా చాలా పెళ్లిళ్లు చేశారు వారు. ‘పరాయి వాళ్లకు పెళ్లిళ్లు చేయటంలో ఏం మజా ఉంటుంది’ అనుకున్నాడో ఏమో! ఓ రోజు కెన్నెత్‌.. జన్నెత్‌ దగ్గరకు వెళ్లి ‘‘ మనం ప్రతి సంవత్సరం ఒకరినొకరు పెళ్లి చేసుకుందాం’’ అని అడిగాడు. అతడి మాటలకు ఆమె ఆశ్చర్యపడకపోగా ‘‘ ఈ ఐడియా ఏదో బాగుంది. అలానే చేద్దాం’’ అంటూ తన మద్దతు తెలిపింది. అంతే వెంటనే లాస్‌ వెగాస్‌కు వెళ్లిపోయి అక్కడి వెనీషియన్ హోటల్లో ఒకే రోజు నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ నాలుగు సార్ల పెళ్లి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఆ తర్వాత ఓ పే..ద్ద కారులో ఆ మరుసటి ఏడాది హెలికాఫ్టర్‌లో స్కై డైవింగ్‌ చేస్తూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంపై జెన్నెత్‌ లండ్‌ మాట్లాడుతూ.. ‘‘ కెన్నెత్‌ను ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా నాకు బోర్‌ కొట్టదు. మా ప్రేమ అలాంటిది. ముసలివాళ్లమై చనిపోయే వరకు ఇలా పెళ్లి చేసుకుంటూనే ఉంటాం. అది చాలా సరదాగా ఉంటుంద’’ని పేర్కొంది. ఈ జంట మొదటిసారి కలుసుకోవటం కూడా ప్రత్యేకమైనదే. కెన్నెత్‌ మొదటిసారి జెన్నెత్‌ను ఆమె మాజీ భర్తతో పెళ్లి జరిగినపుడు చూశాడు. ఆ పెళ్లికి వెడ్డింగ్‌ ప్లానర్‌ కూడా అతడే. ఓ సంవత్సరం తర్వాత జెన్నెత్‌ మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ కొద్దినెలలకే 2005లో జెన్నెత్‌, కెన్నెత్‌లు వివాహం చేసుకున్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top