నేను ఆమెను వేధిస్తున్నానని కేసు పెట్టారు | Srinadh: A Love Breakup Isn't a Failure, Warangal, Telugu Love Stories | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంది

Nov 18 2019 10:33 AM | Updated on Nov 18 2019 10:53 AM

Srinadh: A Love Breakup Isn't a Failure, Warangal, Telugu Love Stories - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చనిపోవాలని చేయని ప్రయత్నం లేదు. అయినా ధైర్యం చాలక...

పక్క పక్క ఇళ్లు మావి. 9వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. నేను స్కూల్‌కు ఎక్కువగా వెళ్లింది లేదు. కానీ, ప్రతి సారి క్లాస్ ఫస్ట్ వచ్చే వాడ్ని. ఆ అభిమానంతో కావచ్చు ఆ అమ్మాయి ఎప్పుడు నాతో మాట్లాడాలని ట్రై చేసేది. టెన్త్, ఇంటర్ వేరే దగ్గర చదివాం. తను బీటెక్‌ వాళ్ల బంధువు ఊరిలో జాయిన్ అయింది. నేను డిగ్రీలో జాయిన్‌ అయి ఇంటి దగ్గరే వుండే వాడ్ని. తను సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసేది. అప్పటికే తనకి వాళ్ల బావతో లవ్ అని, వాళ్ల ఇంట్లో ఇష్టం లేక వేరే ఊరిలో ఉంచి చదివిస్తున్నారని తెల్సు. ఒకసారి వాళ్ల అన్న ఫోన్‌లో నెంబర్ చూసి మెసేజ్ చేశా. తను ఆశ్చర్యపోయింది. కొద్దిరోజుల తర్వాత నిజాయితీగా తన బ్రేకప్ గురించి చెప్పింది. అప్పటి నుంచి రోజూ కాల్స్, మెసేజ్‌లు మా లోకం అయ్యాయి. చదువు అటకెక్కిoది. ప్రేమ పెళ్లి చేసుకుందాం అని ఎన్నో మాటలు చెప్పింది. అప్పటికే మా అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను ఏదైనా వర్క్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నా. ఈలోపు తనకు ఎవరితోనో పెళ్లి కుదిరింది. ఇక ఆ తర్వాతి నుంచి నాకు రోజూ ఫోన్ చేసి ‘నన్ను పెళ్లి చేసుకో లేకపోతే చనిపోతా’ అనేది.

ఈ విషయం మా ఇంట్లో తెలిసింది. అన్నయ్య ఫ్రెండ్స్ ఫోన్ చేసి ‘ఆ అమ్మాయి ఫ్యామిలీ మంచి వాళ్లలా లేరు! ఊరుకో లేదంటే ఆ అమ్మాయి వస్తే తీసుకెళ్లి పెళ్లి చేసుకోండి’ అన్నారు. ఈ విషయం పెళ్లి కుదిరిన అబ్బాయికి తెలియడంతో వాడు తేడాగా మాట్లాడటం బెదిరించడం చేశాడు. తను సూసైడ్‌ అటెంప్ట్ చేసుకుంది. దీంతో వాడితో పెళ్లి రద్దు చేశారు. వాళ్ల నాన్న తనను బాగా కొట్టి చనిపోతా అని బెదిరించి.. నేను తనను ప్రేమ పేరుతో తనని వేధిస్తున్నానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలలు స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగిన. పేరెంట్స్, ఫ్రెండ్స్, బంధువులు, ఊరిలో వాళ్లంతా అవమానంగా చూశారు, దూరం పెట్టారు. చనిపోవాలని చేయని ప్రయత్నం లేదు. అయినా ధైర్యం చాలక చావు అంచు వరకు వెళ్లి వచ్చా. నా పరిస్థితి చూసిన అన్నయ్య, తన ఫ్రెండ్ నన్ను హైదరాబాద్ తీసుకెళ్లారు. ఉస్మానియా హాస్టల్లో ఉంచారు.

మెల్లిగా మామూలు స్థితికి వచ్చిన. చదువుతున్న విద్యార్థుల మధ్య ఉండటంతో నా మీద నాకు నమ్మకం వచ్చింది. 2 సంవత్సరాల డిగ్రీ బ్యాక్‌లాగ్స్‌ మొత్తం ఒకేసారి పాస్ అయ్యాను. ఈలోగా ఎస్‌ఐ , కానిస్టేబుల్‌ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్‌ఐ జాబ్‌ కొద్దిలో మిస్ అయ్యింది. అన్నయ్యకి ఎస్‌ఐ జాబ్, నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఈలోగా వాళ్లే కోర్టు చుట్టూ తిరగం అని నామీద పెట్టిన కేసు వాపస్ చేశారు. 19 నెలల తరువాత ఇంటికి వెళ్లిన. నన్ను కొట్టిన ఎస్‌ఐ, మా తహశీల్దార్ ఊరిలో సన్మానం చేశారు. ఇప్పుడు జాబ్ చేస్తూ వున్నా. కారణాలు ఏవైనా గానీ అమ్మాయిని గుడ్డిగా నమ్మి, నన్ను నా ఫ్యామిలీని ఎంతో బాధ పెట్టిన. నాకు నేనంటే ఎప్పటికీ అసహ్యo. అమ్మాయి తల్లిదండ్రులు ఏం ఆలోచించి నన్ను వేధించారో గానీ, ఇప్పుడు నేను ఊరికి వెళ్లినప్పుడు నా ముందు తల దించుకుని వెళ్తున్నారు.
- శ్రీనాథ్‌, వరంగల్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement