ప్రపోజ్‌ డే! ఇలా ఇంప్రెస్‌ చేయండి

Propose Day : How To Impress Loved One - Sakshi

వాలెంటైన్స్‌ వీక్‌ మొదలై ఓ రోజు గడిచిపోయింది. వారంలోని రెండో రోజు రానే వచ్చింది! అదే ప్రపోజ్‌ డే. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి మెచ్చేలా తమ మదిలోని ప్రేమను వ్యక్తపరచటం.. కొత్తగా ప్రేమలో పడ్డవారైతే తమకిష్టమైన వారి మనసును గెలిచేలా ప్రపోజ్‌ చేయటం ఈ రోజు ప్రత్యేకత. ఎలా ప్రపోజ్‌ చేయాలన్న దానిపైన ప్రతీఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే అందరూ ట్రెండ్‌లో ఉన్నవాటినే ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, మీరు అలా చేయకండి. ఓల్ట్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు కొంచెం కొత్తగా.. పాత పద్దతుల్ని అవలంభించండి. మీ ప్రేమను ఆలోచనలుగా మలిచి.. భావాల్ని అక్షరాలుగా చేసి చక్కటి ప్రేమలేఖ రాయండి.  ఆ ప్రేమలేఖ మీ మనసు ప్రతిబింబించాలని మాత్రం మర్చిపోకండి. ఎదుటి వ్యక్తి ఇంప్రెస్‌ అయ్యేలా కవితలు, కొటేషన్లు రాసినా మంచిదే. ఇక పెళ్లైన మగవాళ్లైతే మీ భాగస్వామి కోసం ప్రేమగా వండిపెట్టండి! కాసేపు వారితో సరదాగా గడపండి.

బెస్ట్‌ ప్రపోజ్‌ డే కొటేషన్స్‌ : 

  • ప్రేమంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను వెతుక్కోవటం కాదు! నిన్ను వెతుక్కోవటం 
  • నాదో కోరిక! ఆ సూర్యుడు భూమిపై తెగిపడే దాకా నేను నీ తోడుగా ఉండాలని
  • నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియదు.. ఓ క్షణం నువ్వు కనిపించకపోతే ఎందుకు బాధపడుతున్నానో తెలియదు.. కానీ, నువ్వు లేకుండా నేను లేనని మాత్రం తెలుసు!
  • నా హృదయాన్ని ఉంగరం చేసి అందించా.. ఎన్నడూ నువ్వు ఒంటరిగా నడవకూడదని ఆశించా.. నా హృదయాన్ని నీ నివాసం చేసి.. గది బయట నా ఆలోచనల్ని కాపలా ఉంచా.. 


Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top