ఎప్పటికీ నిన్ను మర్చిపోను బావ | Nisha Sad Ending Telugu Love Story From Secunderabad | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ నిన్ను మర్చిపోను బావ

Dec 1 2019 10:23 AM | Updated on Dec 1 2019 10:34 AM

Nisha Sad Ending Telugu Love Story From Secunderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి బావ వాళ్ల డాడీ..

మొదటిసారి ఫంక్షన్‌లో కలిశాను తనను. బావ అవుతాడు నాకు. చాలా సరదాగా మాట్లాడేవాడు. అతనంటే చాలా ఇష్టం నాకు. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఆ సమయంలో అతడు డిగ్రీ చదువుతున్నాడు. నేను మాత్రం స్కూల్‌ చదువుతున్నాను. బావ, నేను ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి బావ వాళ్ల డాడీ అప్పులు చేయటం వల్ల ఊరు వదిలి వెళ్లిపోయారు. తర్వాత కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌లో మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. కానీ, అదే సమయంలో నాకు పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టారు. మా నాన్నతో మా ప్రేమ విషయం చెప్పేంత ధైర్యం నాకు లేదు. చెప్పినా కూడా నాన్న వాళ్లు పెళ్లికి ఒప్పుకోరు. అందుకే బావతో ‘నన్ను మర్చిపో బావ’ అని చెప్పాను. కానీ, బావ నన్ను అర్థం చేసుకున్నాడు. ‘నా దగ్గర డబ్బులేనందకు నన్ను మర్చిపో అంటున్నావ్‌ కదా?’ అని అడిగాడు. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను బావ.
- ఈశా, సికింద్రాబాద్‌
చదవండి : ఆయన చాలా నీచంగా మాట్లాడాడు
అందుకే వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement