వాళ్ల నాన్న కోసమే అలా చేశాను!

Nalgonda Boy Jagadeesh Failure Love Story - Sakshi

సరిగ్గా అది 2017వ సంవత్సరం.  నాకు ఫేసుబుక్‌ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. వాళ్ళది మా ఊరి పక్కనే.  కానీ వాళ్ళు నల్గొండలో సెటిల్ అయ్యారు. తను నర్సింగ్ చదువుతూ ఉండేది. మేమిద్దరం రోజు మెస్సేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేమిద్దరం కాల్ చేసుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. తనకోసం వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్లేవాడిని. చాలా సరదాగా ఉండేవాళ్ళం. మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. నేను ఒకరోజు తనకి ప్రపోస్ చేశాను. తను ఒప్పుకోలేదు. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా బాధ వేసింది.  చాలా రిక్వెస్ట్ చేశాను. అప్పటికీ  తాను మాత్రం ఒప్పుకోలేదు. చాలా ఏడ్చాను. కొన్ని రోజుల తరువాత తను నా లవ్‌ను ఒప్పుకుంది. ఆ టైం లో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. 

 తనకోసం కాలేజీ దగ్గరికి వెళ్ళేవాడిని. తనని చూసినప్పుడు ఏదో తెలియని సంతోషం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. తన కోసం బస్టాండ్‌కు వెళ్ళేవాడిని. మేము ఇద్దరం కలిసి బస్‌లో నల్గొండకు వెళ్లే వాళ్లం. బస్‌లో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది.  ఆ టైంలో నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు. తన లేకపోతే నేను ఉండలేను అనేంత ప్రేమ ఎక్కువైంది. నేను జాబ్ కోసం అని హైదరాబాద్ వచ్చేశాను. తను కూడా చదవు ముగించుకొని హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వచ్చేసింది. మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం.  తను హాస్పిటల్‌లో  జాబ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.  నేను కొంచెం పనిమీద మాఊరికి వెళ్ళాను. తను సడన్‌గా కాల్ చేసి నాకు జాబ్ నచ్చడం లేదు, నేను మా ఇంటికి వెళ్తున్న అని చెప్పింది. ఆ టైంలో నాకు చాలా బాధవేసింది.  

తను చదివిన కాలేజీ లోనే జాబ్ చేస్తోంది.  తనకోసం నేను హైదరాబాద్ నుంచి ఆమె పనిచేసే హాస్పిటల్ దగ్గరకి వెళ్లి కలిసేవాడిని. ఆమెను  చూడడానికి కనీసం నెలకు ఐదుసార్లు  వెళ్ళేవాడిని.  తనంటే నాకు ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం.సడన్గా తనకి ఇంట్లో పెళ్లి బంధాలు చూస్తున్నారు అని నాకు చెప్పింది.  మేమిద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో తనంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెంచుకున్నారు.ఆమెకు వాళ్ళ నాన్న అంటే  ప్రాణం. నా బంగారాన్ని అంత ప్రేమగా చూసుకున్నారు.  తను లేకుంటే వాళ్ళ నాన్న ఉండలేరు అని తెలిసింది.

వాళ్ళ నాన్న దుబాయ్‌లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తునారు. ఆయనకు తన కూతురిమీద ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. కావాలని తనని దూరం చేస్తూ వచ్చాను.  నేను మంచివాడిని కాదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పించాను. నాకు చెడు అలవాట్లు ఉన్నాయని కూడా చెప్పించాను.  తను మాత్రం నమ్మలేదు. నాకు కాల్ చేస్తే కట్ చేస్తూ ఉండేవాడి. ఎందుకు అలా చేశానంటే నాతో తను వస్తే వాళ్ల నాన్న బతకలేరు. వాళ్ల నాన్నకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. నా వల్ల వాళ్ల ఫ్యామిలీ కి ఏం కావద్దు అని కావాలని దూరం చేస్తూవచ్చాను.  కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్టు ఉంది.  చాలా అంటే చాలా  ఏడ్చాను.

అలా కొన్ని రోజులు గడిచాక ఆమెకు  పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలిసింది.  ఆ టైంలో ఎంత ఏడ్చానంటే  అది మాటల్లో చెప్పలేను.  నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి  వేరే వాడి సొంతం అవుతుంది అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. 10 నెలల దాకా మనిషిని కాలేదు. తనని నేను బ్రతికి ఉన్నంత వరకు మర్చిపోలేను.  సారీ బంగారం నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఐ లవ్‌ యూ బంగారం, ఐ మిస్‌ యూ. 

జగదీష్‌ ( నల్గొండ).

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-02-2020
Feb 20, 2020, 16:20 IST
నేను ఉరివేసుకుంటా. నా గుండెల్లో కత్తితో పొడుకుని చనిపోవాలనుంది....
20-02-2020
Feb 20, 2020, 15:02 IST
నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు...
20-02-2020
Feb 20, 2020, 12:12 IST
నువ్వు కుదరదంటే చచ్చిపోతా..
20-02-2020
Feb 20, 2020, 10:44 IST
ఒంటిరిగా ఉండటానికి భయపడుతున్నారా?..
19-02-2020
Feb 19, 2020, 16:57 IST
తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో..
19-02-2020
Feb 19, 2020, 15:25 IST
దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో...
19-02-2020
Feb 19, 2020, 12:18 IST
నిద్రపట్టకపోవటానికి మానసిక, భావోద్వేగ సమస్యలు ఏవైనా కారణం కావచ్చు! మీ భాగస్వామి ధరించిన దుస్తుల వాసన మీకు దివ్య ఔషదంలా పనిచేయనుంది....
19-02-2020
Feb 19, 2020, 10:44 IST
అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా...
18-02-2020
Feb 18, 2020, 14:40 IST
నేను బీటెక్‌ చేశాను. కానీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేక నాకు సరియైన జాబ్‌ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను....
17-02-2020
Feb 17, 2020, 16:55 IST
అతన్ని ప్రేమించినందుకు నా మీద నాకే జాలేసింది. నేను ఎంత బిజీగా ఉన్నా...
17-02-2020
Feb 17, 2020, 15:10 IST
మాది కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్ల వాలేరు గ్రామం. మా గ్రామంలో నాది తూర్పు వీధి, నేను మా ఊళ్లోని...
17-02-2020
Feb 17, 2020, 12:16 IST
ఓ ఇద్దరు వ్యక్తులు జంటగా బంధంలోకి ప్రవేశించినపుడు అన్ని రకాల ఛాలెంజ్‌లను వారు ఫేస్‌ చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా...
17-02-2020
Feb 17, 2020, 10:20 IST
అది 2005! నేను 8వ తరగతిలోకి అడుగు పెట్టాను. మా క్లాస్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. తను ఆగష్టు...
16-02-2020
Feb 16, 2020, 16:49 IST
మీరు ఎంత తరచుగా ఇతరుల భాగస్వాములను లోబర్చుకోవటానికి చూస్తారు...
16-02-2020
Feb 16, 2020, 15:10 IST
2012లో బీటెక్‌ ఫేయిలై నేను ఇంటి దగ్గర ఉన్నా. ఏమీ తోచేది కాదు.. ఇంట్లో వాళ్లు నన్ను తిట్టని తిట్టులేదు....
16-02-2020
Feb 16, 2020, 12:27 IST
సినిమా : తాజ్‌ మహాల్‌(2010) తారాగణం : శివాజీ, శృతి, కోటాశ్రీనివాసరావ్‌, బ్రహ్మానందం, నాజర్‌, రఘుబాబు డైరెక్టర్‌ : అరుణ్‌ శింగరాజు సంగీతం :...
16-02-2020
Feb 16, 2020, 10:46 IST
ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా...
15-02-2020
Feb 15, 2020, 17:03 IST
తాము ఎదుర్కొన్న వింత అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు...
15-02-2020
Feb 15, 2020, 14:53 IST
ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది! దానికి తోడు...
15-02-2020
Feb 15, 2020, 12:35 IST
ఎక్కువ మంది మహిళలు వాలెంటైన్స్‌ రోజున ఒంటరిగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top