అలా అన్నందుకు తను అలిగింది | Love Stories In Telugu : I Wants To Marry Her, Krishna | Sakshi
Sakshi News home page

అలా అన్నందుకు తను అలిగింది

Dec 2 2019 10:20 AM | Updated on Dec 2 2019 4:22 PM

Love Stories In Telugu : I Wants To Marry Her, Krishna - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాతో బాగా మాట్లాడింది. నాకేం తెలియదు అన్నట్లు చాట్‌ చేసింది. నేను డైరెక్ట్‌గా..

నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కాంగ్నిజెంట్‌లో పనిచేస్తున్నాను. ఖాళీగా ఉన్నపుడు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తుంటాను. ఓ రోజు నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ సజెషన్‌ వచ్చింది. ఆ ఫ్రెండ్‌ సజెషన్‌ను ఓపెన్‌ చేశాను. తనను చూసిన మొదటిచూపులోనే ఎలాగైనా తనను మ్యారేజ్‌ చేసుకోవాలనిపించింది. తనకు వెంటనే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాను. తను నా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సప్ట్‌ చేయలేదు. నాకు మాత్రం తనతో మాట్లాడాలని, నా ఫీలింగ్స్‌ను తనతో షేర్‌ చేసుకోవాలని అనిపించింది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఓపెన్‌ చేశాను. వినాయక చవితి రోజు హ్యాపీ వినాయక చవితి అని మెసేజ్‌ చేశాను. అప్పటినుంచి మెసేజ్‌లు చేయటం మొదలుపెట్టాను. తన బర్త్‌డే తెలుసుకున్నాను. తనకు పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలిపాను. తన బర్త్‌ డే రోజు ఎవరెవరు శుభాకాంక్షలు తెలిపారో వారందరి మెసేజ్‌లను ఒక ఫొటోగా చేసింది.

అది ఫేస్‌బుక్‌లో స్టోరీగా ఆడ్‌ చేసింది. అందులో నేనుంటానేమోనని పదిసార్లు చూశాను. కానీ, అందులో నేను లేను. అలా కంటిన్యూగా మెసేజ్‌లు చేయటం మొదలుపెట్టాను. తను నా మెసేజ్‌లు చూస్తుందో లేదో కూడా తెలియదు. కానీ, ఒక రోజు నేను పెట్టిన మెసేజ్‌కు ఒక లైక్‌ ఎమోజీ సింబల్‌ పంపింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. గట్టిగా ఏడ్చాను కూడా. తనంటే నాకు అంత ఇష్టం. ఆ తర్వాత రిప్లై ఇవ్వలేదు. మళ్లీ ఒక నెల తర్వాత నా మెసేజ్‌కు రిప్లై వచ్చింది. నాతో బాగా మాట్లాడింది. నాకేం తెలియదు అన్నట్లు చాట్‌ చేసింది. నేను డైరెక్ట్‌గా ‘మీరంటే నాకు ఇష్టం’ అని చెప్పాను. తను నన్ను ఏమీ అనలేదు. తను బీడీఎస్‌ కంప్లీట్‌ చేసి ఎండీఎస్‌కు ప్రిపేర్‌ అవుతోంది. అయితే ఒక రోజు తను లేట్‌గా లేచింది. ‘టిఫిన్‌ చేశావా’ అని అడిగాను.

‘లేదు ఇప్పుడు మెస్‌ ఉండదు’ అని చెప్పింది. ‘ఏమైనా ఆర్డర్‌ చేసుకోండి. లేకపోతే బయట తినండి’ అని అన్నాను. అలా అన్నందుకు తను అలిగింది. మళ్లీ రిప్లై ఇవ్వటం మానేసింది. తను రిప్లై ఇవ్వటం మానేసినా నేను నా ఫీలింగ్స్‌ చెప్పటం మాత్రం మానలేదు. నేను తనకు ఓ నెల మెసేజ్‌లు చేయను అని చెప్పాను. ఎందుకంటే తను ఇప్పుడు ఎండీఎస్‌ ఎంట్రన్స్‌ ఎక్షామ్‌కి ప్రిపేర్‌ అవుతోంది. ఆ ఎక్షామ్‌ డిసెంబర్‌ 20న అయిపోతుంది. మళ్లీ డిసెంబర్‌ 20 తర్వాత నా ఫీలింగ్స్‌ తనతో పంచుకుంటాను. ఎదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటదని నా నమ్మకం. నేను తనను మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం.
- క్రిష్ణ 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement