ఓ మంచి అమ్మాయిని మిస్‌ అయ్యా

 Krishna Vamsi - Pratyusha Childhood Telugu Love Story - Sakshi

నా స్కూల్‌ క్లాస్‌మేట్‌ తను. పేరు అనూష! ఇద్దరం ఎల్‌కేజీనుంచి 9 వరకు కలిసే చదువుకున్నాం. ప్రతిరోజూ ఒకే బస్‌లో కలిసి వెళ్లటం వల్ల బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. చాలా చనువుగా ఉంటాం. బాగా మాట్లాడుకునేవాళ్లం కూడా. సడెన్‌గా ఓ రోజునుంచి మా ఇద్దరి మధ్యా ఉన్న స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టి మా క్లాస్‌మేట్స్‌​ టీజ్‌ చేయటం మొదలుపెట్టారు. స్కూల్లో ఎక్కడ చూసినా నన్ను ప్రత్యూష అని పిలవటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు సరదాగా ఉన్నా. తర్వాత ఒకసారి సడెన్‌గా మా ఫ్రెండ్స్‌ మీద సీరియస్‌ అయ్యాను. ఆ వార్నింగ్‌ తర్వాత అందరూ టీజ్‌ చేయటం ఆపేస్తారని అనుకున్నా.. వాళ్లు ఇంకా ఎక్కువ చేశారు. నాకు ఎక్కడో ప్రత్యూష మీద ఇష్టం అందుకే ఎక్కువగా రియాక్ట్‌ అవ్వలేదు.

ప్రత్యూషకు అది నచ్చలేదో ఏమో మరి నాతో మాట్లాడటం మానేసింది. అలా 8, 9 చదువులు పూర్తయ్యాయి. ఓ రోజు ప్రత్యూషనుంచి నాకో మెసేజ్‌ వచ్చింది తన నుంచి ‘స్కూల్‌ మారుతున్నా’ అని నాకు చాలా గిల్టీగా అనిపించింది. నాకు కూడా ప్రత్యూష ఇబ్బంది పడటం ఇష్టంలేదు. నేను ఏమీ మాట్లాడలేదు. 10, ఇంటర్‌ అయిపోయింది కానీ, ఫ్రెండ్స్‌ ఆమె పేరు మర్చిపోలేదు. ఓ రోజు ఎమ్‌సెట్‌ ఎక్షామ్‌ హాల్‌లో తనను చూశా. కానీ, తను నన్ను చూడలేదు. హాల్లో తను నా వెనుక సీట్లో కూర్చుంది. నాకు మైండ్‌ పనిచేయలేదు చాలా సేపు. అక్కడే సారీ చెప్పాలని ఉంది కానీ ప్రత్యూష నన్ను చూడలేదు. తర్వాత ఇంజనీరింగ్‌ జాయిన్‌ అయ్యాను.

ఓ రోజు హాలిడేస్‌కు ఇంటికి వెళుతూ బస్టాప్‌లో నిల్చున్నా! ప్రత్యూష గురించే ఆలోచిస్తూ ఉండగా ఆమె కూడా బస్‌ కోసం వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులు ఆలోచించా.. ప్రత్యూష అంటే లవ్‌ అని అర్థమైంది. ఎందుకో తన గురించి ఆలోచిస్తుంటే చాలా పవిత్రంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ అయిపోయిన తర్వాత నాకో జాబ్‌ వచ్చింది. ఆ విషయం తనకు చెప్పటానికి ఎంతో ట్రై చేశా. తనకు ప్రపోజ్‌ చేయాలనిపించింది. ఒకరోజు బెంగళూరులో ఉండగా మా ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్లో లంచ్‌ చేస్తున్నా. సడెన్‌గా అనూష వచ్చింది. ఈ సారి జంటగా బాయ్‌ ఫ్రెండ్‌తో వచ్చింది. తను చాలా హ్యాపీగా ఉంది! అది చాలు నాకు. నా లేట్‌ కారణంగా ఓ మంచి అమ్మాయిని మిస్‌ అయ్యా.
- క్రిష్ణ వంశీ  


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వార్తలు

11-11-2019
Nov 11, 2019, 16:27 IST
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తను చేసిన మోసాన్ని లైఫ్‌లాంగ్‌ గుర్తుంచుకుంటాను..
11-11-2019
Nov 11, 2019, 14:54 IST
అలాంటి వాడు తన మీద చేయిచేసుకున్న అమ్మాయి...
11-11-2019
Nov 11, 2019, 12:19 IST
ఇతరులతో ఎక్కువగా కలవకుండా, తమ భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తపరచకుండా తమలో తాము గడిపే వ్యక్తులను ఇంట్రావర్ట్‌లు( అంతర్ముఖులు) అంటారు. వీరు...
11-11-2019
Nov 11, 2019, 10:19 IST
తను ఉంటున్న హాస్టల్ కోసం వెతకడం మొదలు పెట్టా. అనుకోకుండా ఒకసారి...
10-11-2019
Nov 10, 2019, 16:29 IST
నా పేరు వెంకటేష్‌! మాది వైజాగ్‌. నాకు బీటెక్‌ సీట్‌ శ్రీకాకుళంలో వచ్చింది. నేను బీటెక్‌ జాయిన్‌ అవుతున్నపుడే నాతో...
10-11-2019
Nov 10, 2019, 15:45 IST
బాధతో ఉన్నపుడు మనం ప్రేమించే వ్యక్తుల స్పర్శతో...
10-11-2019
Nov 10, 2019, 12:35 IST
ఆ సమయంలోనే అతడికి స్వాతిపై అనుమానం మొదలతుంది.  ఆ అనుమానమే.. 
10-11-2019
Nov 10, 2019, 10:37 IST
వాడు బుజ్జిని బ్లాక్‌ మేయిల్‌ చేయటం ప్రారంభించాడు. కాల్‌ రికార్డ్స్‌, ఫొటోలు...
09-11-2019
Nov 09, 2019, 16:47 IST
ప్రిన్సిపాల్‌కి, టీచర్లకి మా ప్రేమ విషయం తెలిసింది. ఆ రోజునుంచి...
09-11-2019
Nov 09, 2019, 14:50 IST
వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్లు నేటి యువత ప్రేమకు వారధులుగా మారుతున్నాయి. ప్రతి క్షణం సందేశాల ప్రవాహాన్ని ఇటునుంచటు, అటునుంచిటు చేరవేస్తూ బంధాలను బలపరుస్తున్నాయి....
09-11-2019
Nov 09, 2019, 12:05 IST
ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమకు మతం ఎన్నడూ అడ్డు కాదని...
09-11-2019
Nov 09, 2019, 10:30 IST
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోజుల్లో నా క్లాసుమేట్ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఓ రోజున భువనగిరి ఆర్‌టీసీ బస్‌స్టాండ్‌లో నా ప్రేమ...
08-11-2019
Nov 08, 2019, 14:55 IST
నాకు చిన్నప్పటినుంచి లవ్‌ అంటే ఇష్టం లేదు! ప్రేమ పెళ్లిళ్లపైనా నమ్మకం లేదు. ఎందుకంటే లవ్‌ చేస్తే ఇలా ఉండాలి,...
08-11-2019
Nov 08, 2019, 11:56 IST
మేషం : మీ ప్రేమ ప్రతిపాదనలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు మంగళ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు ఇష్టపడే వారి నుంచి...
08-11-2019
Nov 08, 2019, 10:49 IST
నాతో మాట్లాడ్డం వల్ల వాళ్లు ఇంత ఘోరంగా బిహేవ్‌ చేశారు...
07-11-2019
Nov 07, 2019, 15:29 IST
ఇదే వారిద్దరి మధ్యా గొడవకు దారి తీస్తుంది! ఇద్దరూ విడిపోతారు....
07-11-2019
Nov 07, 2019, 11:50 IST
‘స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లు’ అన్న మాట అక్షర సత్యం. విజ్ఞానం, వినోదం.. ఒకటేంటి అన్ని...
07-11-2019
Nov 07, 2019, 10:22 IST
వైజాగ్‌లోని ఓ కాలేజ్‌లో నేను జాబ్‌చేసే వాడిని. అప్పుడు తను బ్యాంక్‌ ఎక్షామ్‌ రాయటానికి వచ్చింది. నేను ఆ ఎక్షామ్‌కి...
06-11-2019
Nov 06, 2019, 16:05 IST
మాది విజయనగరం జిల్లా. నేను ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నపుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. తను అప్పటికి...
06-11-2019
Nov 06, 2019, 12:25 IST
అతడ్ని ఇంప్రెస్‌ చేయటానికి సతవిధాల ప్రయత్నిస్తుంది...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top