నాకు పెళ్లయ్యాక తను కనిపించింది | Happy Ending Telugu Love Story By Nag | Sakshi
Sakshi News home page

నాకు పెళ్లయ్యాక తను కనిపించింది

Jan 30 2020 12:39 PM | Updated on Jan 30 2020 12:42 PM

Happy Ending Telugu Love Story By Nag - Sakshi

నేను తనని చూసిన క్షణం నుంచి నా గుండెలో ఆమెనే నిలుసుకున్నా. ఆమెను చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాను. కానీ నా ప్రేమ విషయం ఆమెకు చెప్పే ధైర్యంలేక ఆలస్యం చేయడం వల్ల వాళ్ల తల్లిదండ్రులు తనికి పెళ్లిచేశారు. ఆ క్షణమే చచ్చిపోవాలనుకున్నా. కానీ అమ్మానాన్నలకు నేను ఒక్కడినే. నేను చనిపోతే వాళ్లను ఎవరు చూసుకుంటారు అని ఆగిపోయా. కొన్నాళ్లకు మా బంధువుల అమ్మాయికి నేనంటే ఇష్టం అని తెలిసింది. నాకు ప్రేమ దక్కలేదు,కానీ నన్ను ప్రేమించే వాళ్లు నాకు దొరకడం అదృష్టం కదా . ప్రేమించిన వాళ్లు దూరమైతే పడే బాధేంటో నాకు తెలుసు అందుకే తనని పెళ్లిచేసుకున్నా.

హ్యాపీ ఫ్యామిలీ మధ్యలో గ్యాప్‌ చెప్పలేదు కదా.. నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎదురుపడింది. మళ్లీ నాలో ఆశలు మొదలయ్యాయి. 03-01-1984 తేదీన న్యూఇయర్‌ గ్రీటింగ్‌ ఇచ్చి స్నేహం మొదలుపెట్టాను. ఆమె పేరు కూడా నాకు తెలీదు అప్పటివరకు. ఆమె పేరు కూడా అడిగే ధైర్యం లేక ఆమె వెళ్లే టైప్‌ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లి తెలివిగా ఆమె చేసే టైమ్ లో ఆమె చేసే మిషన్ పై ఎవరు అని రిజిస్టార్ లో వెదికి తెలుసుకున్నా. తనకి  పెళ్లి అయినా మళ్ళీ ఎలా వచ్చింది అని మీకు డౌట్ కదా ..ఆమె డిగ్రీ చదువు కోసం వాళ్ళ అమ్మ గారింటికి వచ్చింది. అలా మా మధ్య స్నేహం చిగురించి 25 సంవత్సరాలు. స్నేహితులుగానే మా కుటుంబం, వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. ఎన్నో సినిమాలు, పుణ్యక్షేత్రాలు కలిసి వెళ్లేవాళ్లం. కొన్నాళ్ల తర్వాత వారి కుటుంబం ఇళ్లు మారాల్సి వచ్చింది. ఇప్పటికీ ఫోన్‌లో ఇరువురి కుటుంబాల మధ్య అదే స్నేహం,అదే ఆప్యాయత.

--నాగ్‌, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement