ఎందుకు బావ అవాయిడ్ చేస్తున్నావ్? | Bujji Sad Ending Telugu Love Story From Hyderabad | Sakshi
Sakshi News home page

ఎందుకు బావ అవాయిడ్ చేస్తున్నావ్?

Jan 9 2020 8:27 PM | Updated on Jan 9 2020 8:46 PM

Bujji Sad Ending Telugu Love Story From Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు మా నాన్న గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఉన్నాను. ఒక వారం రోజులు అక్కడే ఉన్నాను. నేను మా అమ్మ, నాన్నమ్మ అక్కడే ఉన్నాం. అప్పుడే ఫేసుబుక్‌లో ఒక మెసేజ్ వచ్చింది ‘హాయ్’ అని, నేను కూడా ‘హాయ్’ అని రిప్లై ఇచ్చాను. తనకి నేను తెలిసిన వారిలా చాట్ చేశాడు. నేను మా బాబాయిని అడిగాను.. ఇలా ఎవరో చాట్ చేస్తున్నారని. తను నీకు వరసకి బావ అవుతాడని చెప్పాడు. మన వాళ్లే కదా అని చాట్ చేశాను. చాటింగ్ తరవాత కాల్స్.. అలా అలా చాలా మాట్లాడుకున్నాము. తను నాకు ప్రపోస్‌ చేశాడు. నాకు అలాంటి ఆలోచన లేదన్నాను. నాకు చదువు, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అదే తెలుసు. తను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు కొంత టైం కావాలి అన్నాను.

ఒక రోజు నాన్న గారిని హాస్పిటల్ తీసుకుని వెళ్లాం. తను ఆ రోజు మా దగ్గరకు వచ్చాడు. అదే ఫస్ట్ టైం తనని చూడటం! చూడగానే తను నాకు నచ్చారనిపించింది. మా ఇంట్లో చెప్పాను. కులాలు కూడా ఒక్కటే అవ్వటం వల్ల మా ఇంట్లో ఒపుకున్నారు. ‘మా ఇంట్లో ఒప్పుకోవాలంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడే మా ఇంట్లో చెప్తాను’ అన్నాడు. అవును కదా మంచి పొజిషన్‌లో ఉంటే అందరికీ మంచిది కదా అని అనుకున్నాను. తను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. కానీ తనకి జాబ్ రాలేదు. నాకు హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్లాను.

రోజులు గడుస్తున్నా తనకి జాబ్ రాలేదు. మా ఇంట్లో నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. ‘తనకి జాబ్ లేదు కదా! ఈ సంబంధం చేసుకో’ అని మా నాన్నమ్మ ఫోర్స్ చేసింది. అప్పుడే తనకి నాకు తెలిసిన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాను. మా ఇంట్లో ‘పెళ్లి చూపులకు వచ్చి వెళ్లు’ అని ఫోర్స్ చేశారు. నేను ఆ విషయం తనకి చెప్పాను. ఒకసారి వెళ్లిరా .. అని చెప్పాడు. కానీ తనకు జాబ్ చేసే దగ్గర ఒక అమ్మాయి పరిచయం అయింది. తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ నాకు నాకు తెలియదు వాళ్లు లవ్ చేసుకుంటున్నారని. నేను అడిగాను ‘ఎందుకు బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావ్! అని అప్పుడు నన్ను చాలా తిట్టాడు.

పెళ్లి చూపులకి ఎందుకు వెళ్లావ్ అని. కానీ, నిజం ఏమిటంటే తను వెళ్లమంటేనే నేను వెళ్లాను. మా ఇంట్లో టైం అడిగి వచ్చాను. అది తను నమ్మలేదు. నన్ను వదిలించుకోవడానికే ఇదంతా చేశారని నాకు తెలిసింది.  నాకు తనంటే చాలా ఇష్టం తన కోసం ఏమైనా చేస్తా అని తెలుసు. అందుకేనేమో తను త్వరగా ఆ అమ్మాయిని వాళ్ల ఇంట్లో చెప్పి 15రోజులకే పెళ్లి చేసుకున్నారు. నాకు చచ్చిపోవాలనిపించింది. చాలా ఏడ్చాను, కానీ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అదే నా ఫస్ట్ లవ్ కూడా. కానీ ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
- బుజ్జి, గుంటూరు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement