నా మీద కేసు పెట్టింది.. భయంగా ఉంది | Breakup Love Stories In Telugu : Raju Sad Love, Rajahmundry | Sakshi
Sakshi News home page

నా మీద కేసు పెట్టింది.. భయంగా ఉంది

Jan 9 2020 2:19 PM | Updated on Jan 9 2020 2:31 PM

Breakup Love Stories In Telugu : Raju Sad Love, Rajahmundry - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మేమిద్దరం దాదాపు 14ఏళ్లనుంచి ప్రేమించుకుంటున్నాము. తను నన్ను చాలా ఇష్టపడింది. నన్ను చాలా బాగా చూసుకునేది. మేమిద్దరం కలిసి తిరగని ప్రదేశమంటూ ఏదీ లేదు. షాపింగ్‌లు, సినిమాలు, బీచ్‌లు ఎక్కడికిపడితే అక్కడికి వెళ్లేవాళ్లము. అమ్మ చనిపోయినపుడు నాకు ఫోన్‌ చేసి ‘నేనే మీ అమ్మను’ అని చెప్పింది. అప్పటినుంచి తనంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను అసలు ఉండలేకపోయేవాడిని. నా కోసం చాలా రిస్క్‌లు చేసింది. ఇద్దరం ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. సడెన్‌గా ఓ రోజు మా ఇద్దరి సంగతి మా వాళ్లకు తెలిసిపోయింది. ఆ అమ్మాయికి ఏం చెప్పారో తెలియదు కానీ, పదిరోజుల్లో నన్ను వదిలేసింది. నా ఫోన్‌ నెంబర్‌ బ్లాక్‌ చేసింది. నాతో మాట్లాడటం మానేసింది.

నన్ను మానసికంగా కృంగదీసింది. నిద్ర మాత్రలు వేసుకుంటేనే కానీ, నిద్రరాని పరిస్థితి ఏర్పడింది. ఏం జరిగిందో నాకేమీ అర్థంకావటం లేదు. దానికి తోడు నామీద కేసుకూడా పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసు నడుస్తోంది. నేనేమి తప్పు చేశానో నాకు తెలియటం లేదు. నా బాధ ఏమిటంటే రేపు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే. ఆ వ్యక్తికి మా పెళ్లి విషయం తెలిస్తే తనను ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. వాళ్ల పేరెంట్స్‌ ఆడిన గేమ్‌లో బలిపశువునయ్యాను. 
- రాజు, రాజమండ్రి.

చదవండి : షాకింగ్‌ న్యూస్! చాలా కూల్‌గా చెప్పింది!
ప్రేమ ఓకే! పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు..



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement