తను అలా అంటుందని అసలు ఊహించలేదు!

A Boy Failure Love Story - Sakshi

 నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అందరి అబ్బాయిల్లాగా అమ్మాయిల వెంట పడే వాడ్ని కాదు. ఎప్పుడూ చదువు మీదే ఉండేది నా ధ్యాసంతా. అలా నా డిగ్రీని 2015 లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తరువాత ఐసెట్ ద్వారా ఎంసీఏ హైదరాబద్ లో పూర్తి చేశాను. నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్‌  అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్ళేవాడిని. అలా నేను కాలేజీకి వెళ్లకుండానే ఫస్ట్ క్లాస్ లో ఎంసీఏ పూర్తి చేశాను. ఎంసీఏ పూర్తి చేసిన తరువాత అందరి లాగా ఏదో సాఫ్టువేర్ కంపెనీ లో జాబ్ చేయాలి అనుకోలేదు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. ఎందుకంటే నా ఆలోచనలు ఎప్పుడు పెద్దవిగా వుండేవి. ఆ ఆలోచనలే ఇప్పుడు నన్ను అయోమయంలో పడేస్తాయి అని ఎప్పుడూ అనుకోలేదు.

 నా బిజినెస్ ఐడియా ఏంటంటే చాలా మంది ప్రజలు టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతారు. కొంత మంది తమ వెబ్ సైట్ డిజైన్ కోసం సాఫ్ట్‌వేర్ కంపెనీని సంప్రదిస్తారు. కొంత మంది వెబ్‌సైట్ ట్రాఫిక్ కోసం గూగుల్ లాంటివి సంప్రదిస్తారు. వాళ్ళ అందరి కోసం నేను కొన్ని ఫేస్‌బుక్‌ పేజెస్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ను క్రియేట్ చేశాను. అలా నేను ఒక ఫేస్‌బుక్‌ పేజీను సైన్స్ & టెక్నాలజీ పేరుతో స్టార్ట్ చేశాను. అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యింది. నేను ఎప్పుడూ మెసేజెస్ పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి కూడా నాలాగే ఫేస్‌బుక్‌ సొసైటీకి సంబంధించిన పేజిని రన్‌ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ సొసైటీ మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. అలా నేను ఆమె ప్రతి పోస్ట్ కు లైక్స్‌, కామెంట్స్ పెట్టేవాడిని. ఎవరైనా నెగటివ్ గా కామెంట్స్ పెడితే నేను హీరో లాగా వాళ్ళకు రిప్లై ఇచ్చేవాడిని. ఆమె నన్ను ఇష్టపడుతుంది అనే భ్రమలో నేను నా బిజినెస్, జాబ్ మీద దృష్టి పెట్టలేదు. ఒక రోజు నా మనస్సు లోనీ మాట ఆమెకు చెప్పాను. కానీ ఆమె నాకు ఇలా రిప్లై ఇచ్చింది. నువ్వు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌వు మాత్రమే అని అంది. నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. నాకు అందరిలాగ ఫ్రెండ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల అలా అయ్యాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్న. ఇప్పుడు ప్రేమ అంటేనే చాలా భయం వేస్తోంది. 

విజయ్‌(పేరు మార్చాం).


 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top