కౌగిలించుకుంది...తరువాత మిస్సయ్యింది! | Anil kumar Failure Love Story | Sakshi
Sakshi News home page

కౌగిలించుకుంది...తరువాత కనిపించకుండా పోయింది!

Jan 19 2020 6:36 PM | Updated on Jan 19 2020 9:03 PM

Anil kumar Failure Love Story - Sakshi

నా పేరు అనిల్‌ కుమార్‌. నేను ఇంటర్మీడియట్‌ అయిపోయిన తరువాత డీసెట్‌ ఎంట్రెన్స్‌ కోసం కోచింగ్‌కు వెళ్లాను. కొన్ని రోజుల తరువాత ఒకమ్మాయి కొత్తగా కోచింగ్‌లో చేరింది. నేను కొత్తలో పెద్దగా పట్టించుకోలేదు. తరువాత తను కొంచెం కొంచెం పరిచయమయ్యింది. చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్లం. కాలం గడుస్తున్న కొద్ది ఒకరిని ఒకరం చూసుకోవడం మొదలుపెట్టాం. నేను ఎవరిని ఏం అడిగిన తను తెచ్చి నాకు ఇచ్చేది. ఒకరోజు నువ్వంటే నాకిష్టమని తనకి చెప్పేశాను. తను నాకు సమాధానం చెప్పకుండా ఆ రోజు వాళ్ల ఊరిలో ఫెస్టివల్‌ ఉందని రమ్మని చెప్పింది.

నేను అక్కడికి వెళ్లాను కానీ తను మాత్రం అక్కడికి రాలేదు. నేను తరువాత రోజు నేను మీ ఊరు వచ్చాను. నువ్వు ఫెస్టివల్‌కు ఎందుకు రాలేదు అని అడిగాను. తను నా కోసంవచ్చావా అని నన్ను చూస్తూ ఉంది. క్లాస్‌లో ఎవరు లేరు. తను నన్ను కౌగిలించుకుంది. నేను వెంటనే ఇంకోసారి ఐ లవ్‌ యూ చెప్పాను. తను వెంటనే నన్ను వదిలి క్లాస్‌లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత తను నాతో మాట్లాడలేదు. నాలుగురోజులకు మా కోచింగ్‌ అయిపోయింది. ఎంత రిక్వెస్ట్‌ చేసిన తన నుంచి నో రెస్పాన్స్‌. కోచింగ్‌ అయిపోయిన తరువాత తను ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను.  

అనిల్‌కుమార్‌(కోటనందూరు). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement