ప్రేమించానంది.. కాస్ట్‌ చెప్పాక వదిలేసింది.

Ajay Sad Ending Telugu Love Story - Sakshi

నా పేరు అజయ్‌. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఉన్న పిచ్చితో హైదరాబాద్‌ వచ్చాను. మూడు నెలలు చాలా కష్టపడ్డాను అవకాశాల కోసం. కానీ రాలేదు. ఓరోజు అమ్మతో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండగా..మా రూమ్‌ ముందునుంచి ఓ అమ్మాయి వెళ్లింది. దేవకన్యలా కనిపించింది. తనను ఫాలో చేసుకుంటూ వెళ్లా. ఇంతలో నా మొబైల్‌ రింగ్‌ అయ్యింది.  వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. అంతే నా గుండెలో గంటలు మోగాయి. సినిమా డైలాగు అనుకోకండి. నిజంగానే నాకు అలా అనిపించింది. తనతో మాట్లాడాలి కానీ ఎలా అనుకుంటుండగానే తను వాళ్లింటికి వెళ్లిపోయింది.

తన ఊహల్లోనే తేలిపోతున్న నాకు తను మళ్లీ దర్శనమిచ్చింది. మా రూమ్‌ ముందునుంచే వాళ్ల ఫ్రెండ్‌తో కలిసి కాలేజీకి వెళ్తుంది. అప్పుడు వాళ్ల ఫ్రెండ్‌..ఏంటీ నీ ఫేస్‌బుక్‌  ఫ్రొఫైల్‌ ఫోటో ఫ్రభాస్‌ది పెట్టావ్‌ అని అడిగింది. తను అంతకుముందే ఐడీ పేరు కూడా చెప్పింది. నేను వెంటనే తన ఫేస్‌బుక్‌ ఐడీ వెతికి తనకి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టా. అప్పట్నుంచి తను ఎప్పుడు నా రిక్వెస్ట్‌ ఓకే చేస్తుందా అని ఫోన్‌ చూస్తునే ఉన్నా. సాయంత్రానికి నన్ను కరుణించింది. తన పేరు అంజలి (పేరు మార్చాం) వెంటనే హాయ్‌ అని మెసేజ్‌ పెట్టేశా. కానీ తను గంట తర్వాత రిప్లై ఇచ్చింది. నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను నెలరోజులుగా చూస్తున్నా. నువ్వు నాకు రిక్వెస్ట్‌ పెట్టాలనే  మా ఫ్రెండ్‌తో నా ఫేస్‌బుక్‌ ఐడీ గురించి మాట్లాడించా అనేసరికి నేను షాక్‌ అయ్యా. అప్పట్నుంచి మేం హైదరాబాద్‌లో తిరగని ప్లేస్‌ అంటూ లేదు.

అలా సంవత్సరం అయ్యక మా ప్రేమ విషయం వాళ్ల అమ్మతో చెప్పింది. ఆంటీ ఒప్పుకున్నారు. ఇక నాదే లేటు అని మా ఇంట్లో చెప్పా. ఒప్పుకున్నారు. కాదు ఒప్పించా. వారం అయ్యాక తన నుంచి కాల్‌ వచ్చింది. ఇంతకీ మీ కాస్ట్‌ ఏంటీ అని. నేను చెప్పా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ నేను ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేసేది కాదు. నాతో మాట్లాడేది కాదు. మా నాన్నకి ఆరోగ్యం బాలేకపోవడంతో 15 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. అసలు అంజలి అలా ఎందుకు చేస్తుందో తెలీక నరకంగా అనిపించేది.

హైదరాబాద్‌ వెళ్లా. తనతో మాట్లాడాక అమ్మాయిలు ప్రేమించిన వ్యక్తిని ఇంత తొందరగా ఎలా మర్చిపోతారో అని ఆశ్చర్యం వేసింది. మా నాన్నకు కాస్ట్‌ ఫీలింగ్‌ ఎక్కువ. నీతో పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. నేను మా బావని పెళ్లిచేసుకుంటున్నాన​ంది. నువ్వే నా ప్రాణం, నీతోనే జీవితం అన్న మాటలు అంజలి అప్పుడే మర్చిపోయిందా అనిపించింది. తనని ఒప్పించడానికి చాలా ప్రాథేయపడ్డా. అయినా వినలేదు. తను నాకు దూరమైనా..అంజలి పేరు నా గుండెల మీద పచ్చబొట్టులా మిగిలిపోయింది.

-- అజయ్‌

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top