వారంలో పెళ్లి... అంతలోనే! | Abhi From Krishna Disrict : Failure Telugu Love Story | Sakshi
Sakshi News home page

వారంలో పెళ్లి... అంతలోనే!

Mar 11 2020 3:28 PM | Updated on Mar 11 2020 6:12 PM

Abhi From Krishna Disrict : Failure Telugu Love Story - Sakshi

జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది ఆపలేము. ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. మాది చాలా రిచ్‌ ఫ్యామిలీ. నేను కోరుకున్నది అప్పటి వరకు అన్ని దక్కాయి. ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మనాన్నలకు నేనొక్కడినే. నా పేరు అభి. నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నేను అడగకుండానే అన్ని ఇచ్చారు. ఏది అడిగిన ఎప్పుడు కాదనలేదు. 

నేను మా కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సరిత. చాలా మంచిది. మానవత్వం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. చిన్న వయస్సులోనే ఇలా ఉండటం చూసి నాకు చాలా బాగా నచ్చింది. నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను కొన్ని రోజులు తరువాత నాకు ఒకే చెప్పింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటే నన్ను చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్‌ లేదని చెప్పింది. నేను మా ఇంట్లో విషయం చెప్పాను. ఎప్పటిలాగానే వాళ్లు నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. వాళ్లే వెళ్లి సరిత వాళ్ల ఇంట్లో మాట్లాడారు. కులాలు వేరు కావడంతో మొదట వాళ్లు ఒప్పుకోకపోయిన తరువాత అంగీకరించారు. 

చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంగేజ్‌మెంట్‌ కూడా గ్రాండ్‌గా చేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. పెళ్లి ఇంకో వారం ఉందనగా అనుకోని ఘటన జరిగింది. సరిత యాక్సిడెంట్‌లో చనిపోయింది. రెండు కుటుంబాలలో విషాదం అలముకుంది. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా బాధ చూడలేక మా అమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. నేను ఆ బాధలో నుంచి బయటపడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సరిత రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్న ఏదీ జరగాలనుంటే అదే జరుగుతుందని అర్థం అయ్యింది. మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నేను మాత్రం సరిత ఆలోచనల్లో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నాను. తన స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. 

అభి, కృష్ణా జిల్లా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement