
స్థానికులు చంపిన నాగుపాము
కర్నూలు, కొలిమిగుండ్ల: టూరిస్ట్ బస్సులో నుంచి శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పాము కింద పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యాత్రికుల బృందం బెలుం గుహలను తిలకించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తాడిపత్రి వైపునకు బయలు దేరారు. కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ దాటగానే డ్రైవర్ వైపు నుంచి నాగుపాము కింద పడింది. స్థానికులు గమనించి కర్రలతో కొట్టి చంపారు. కాగా పాము బస్సులో ఉన్న విషయంతో పాటు కిందపడిన సమాచారం యాత్రికులకు తెలియకపోవడం గమనార్హం.