బెంగళూరు డిప్యూటీ మేయర్‌ హఠాన్మరణం

Ramila Umashankar, Bengaluru Newly Elected Deputy Mayor Passes Away - Sakshi

నగర డిప్యూటీ మేయర్‌ రమీలా ఉమాశంకర్‌  కన్నుమూత

గుండెపోటుతో ఆకస్మిక మరణం

సెప్టెంబర్‌ 28న డిప్యూటీ మేయర్‌గా ఎంపిక

సాక్షి, బెంగళూరు :  కొత్తగా ఎన్నికైన బెంగళూరు  డిప్యూటీ మేయర్‌ రమీలా ఉమాశంకర్ (44) హఠాన‍్మరణం  దిగ్ర‍్భాంతికి గురి చేసింది.  కేవలం వారంరోజుల క్రితమే ఎన్నికైన నగర  డిప్యూటీ మేయర్   శుక్రవారం ఉదయం గుండెపోటుతో  మృతి చెందారు.   కర్ణాటకలోని కావేరిపుర వార్డు నుండి 44  జేడీఎస్‌ కార్పొరేటర్  ఎన్నికైన ఆమె సెప్టెంబరు 28 న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) డిప్యూటీ మేయర్‌గా నియమితులయ్యారు.  నగర చరిత్రలో రెండవసారి మేయర్ (గంగాంబిక మల్లికార్జున్‌)గా  డిప్యూటీ మేయర్‌గా  ఇద్దరు మహిళలు ఎంపికయ్యి రికార్డు సృష్టించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయ నేతలు ఇతర నగరు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా డిప్యూటీ మేయర్‌ రమీలా ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి  తీవ్ర దిగ్ర్భాంతిని  వ్యక్తం చేశారు.  అక్టోబర్ 4 న జరిగిన నమ్మ మెట్రో ఆవిష‍్కరణ కార్యక్రమంలో తనతోపాటు  ఆమె  పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.  చాలా చిన్న వయసునుంచే సామాజిక సేవలో చురుకుగా ఉంటూ, రమీలా ఉమాశంకర్‌ నగరానికి చాలా సేవ చేశారంటూ మాజీ ప్రధాని,  జేడీఎస్‌ చీఫ్‌   హెచ్‌డీ దేవెగౌడ తన సంతాపాన్ని ప్రకటించారు.   నిబద్ధత కల ఒక పార్టీ కార్యకర్త  రమీలా ఇక లేరన్నవార్త  తను షాక్‌కు గురి చేసిందన్నారు.

 

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top