
జెనీవా : కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను ప్రమాదకర దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. గురువారం ఒక్కరోజే 1,50,000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకావటం, అందులో సగానికి పైగా అమెరికాలోనివి కావటంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి అదో కష్టతరమైన ప్రయాణమని అన్నారు. అవసరమైన విధంగా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకోవాలని, క్రమంగా.. ఎప్పటికప్పుడు కరోనా వివరాలను సేకరిస్తూ ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి అవకాశాలను గుర్తించకపోతే అది విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 4,62,525 మంది మృత్యువాత పడ్డారు.
చదవండి : ఒక్క రోజులో దాదాపు 55వేల కేసులు