లండన్: చారిత్రక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తన 800 ఏళ్ల చరిత్రలో తొలిసారి పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ ప్రవేశాలు కల్పించింది. 2017లో వివిధ డిగ్రీ కోర్సులకు 1275 మంది మహిళలకు, 1165 మంది పురుషులకు అవకాశం ఇచ్చినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. అందులో 1070 మంది మహిళలు, 1,025 మంది పురుషులు అవసరమైన గ్రేడ్లు సాధించి సీట్లు పొందినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమవుతాయి.
తాజా గణాంకాలు మహిళా విద్యార్థుల పురోగతికి సంకేతాలని యూనివర్సిటీ వ్యాఖ్యానించింది. ప్రముఖ యూనివర్సిటీలు వెనకబడిన, నిరుపేద విద్యార్థులకు కల్పిస్తున్న ప్రవేశాల్లో గణనీయ పెరుగుదల నమోదైనట్లు ఆక్స్‌ఫర్డ్ వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో అత్యంత పురాతన యూనివర్సిటీగా పేరొందిన ఆక్స్‌ఫర్డ్‌ను ఎప్పుడు స్థాపించిందీ స్పష్టంగా తెలియదు. కానీ 1096లో బోధన ప్రారంభమై, 1167లో అభివృద్ధి చెందినట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది.
పురుషులను అధిగమించారు
Jan 26 2018 2:05 AM | Updated on Jan 26 2018 2:05 AM
Advertisement
Advertisement