పొరుగువారిపై ట్రంప్‌ మరో పిడుగు

Will Get Rid Of Chain Migration: Donald Trump - Sakshi

సాక్షి, వాషింగ్టన్‌ : నిరంతర వలస విధానానికి(చైన్‌ మైగ్రేషన్‌) స్వస్తి పలకనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అలాగే, లాటరీ వీసా కార్యక్రమాన్ని కూడా వదిలించుకుంటామని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెడ్‌ ఉల్లా అనే వలసదారుడే కారణంగా అని ఈ సందర్భంగా చెప్పారు. 'వీసా లాటరీ ప్రోగ్రాంకు, నిరంతర వలస విధానానికి మేం త్వరలోనే స్వస్తి పలుకుతాం' అని ట్రంప్‌ గురువారం పత్రికా సమావేశంలో తెలిపారు. లాటరీ కార్యక్రమం ద్వారా తమ దేశంలోకి చాలా చెడ్డవాళ్లు అడుగుపెడుతున్నారని, దీనిని ఇక భరించలేమని చెప్పారు. అలాంటి ప్రజలు తమ దేశానికి వద్దని, అలాంటి వారితో తనకు భయంగా ఉందని, అసహ్యం వేస్తుందని, నీచంగా అనిపిస్తోందని చెప్పారు. ఇక అమెరికా తిరిగి ఎప్పటిలాగా బలం పుంజుకుంటోందని, వేగంగా పునర్‌వైభవం సంతరించుకుంటుందని త్వరలోనే ప్రపంచమంతా చూస్తుందని తెలిపారు.

దేశం దాటి వెళ్లిన నాలుగు ట్రిలియన్‌ డాలర్లు తిరిగి స్వదేశానికి తిరిగి రానున్నాయని చెప్పారు. పన్ను కోడ్‌లలో తాము తీసుకొచ్చిన మార్పులు అందుకు సహకరిస్తాయని, తమ దేశ కంపెనీలన్నీ తిరిగి విదేశాల నుంచి ఆదాయాన్ని పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 14మంది సభ్యుల అపెక్స్‌ బాడీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపై ట్రంప్‌ స్పందించారు.

అదే సమయంలో అమెరికా ప్రతినిధి హాలీ ఆ తీర్మానాన్ని వీటో చేయడంపై కూడా మాట్లాడారు. 'తనకు మద్దతు ఇచ్చిన హాలీకి ధన్యవాదాలు. ఇతర దేశాలు తమ అధికారాన్ని ఉపయోగించాలని చూసినా హాలీ నాకు మద్దతుగా ఉన్నారు. వాళ్లంతా మాదగ్గర నుంచి మిలియన్స్‌లలో బిలియన్స్‌ డాలర్లలో డబ్బులు తీసుకుంటారు. కానీ, మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మేం అన్నింటిని గమనిస్తున్నాం. వాళ్లు అలాగే ఓటు వేసుకోనిద్దాం. మనం మరింత డబ్బు ఆదా చేద్దాం. ఈ విషయంలో ఎవరినీ మనం అతి చేయనివ్వొద్దు' అని ఆయన చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top