మెక్సికో సరిహద్దు గోడకు 1.14 లక్షల కోట్లు

White House wants to spend $18 billion till 2027 to build part of Mexico border wall - Sakshi

అమెరికా–మెక్సికో సరిహద్దు గోడపై ట్రంప్‌

వాషింగ్టన్‌: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తారన్న దానిపై కొంత స్పష్టత వచ్చింది. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది.

అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది. మరోవైపు, పాక్‌ను దారిలోకి తేవడానికి ఆర్థిక సాయం నిలిపేయడమే కాకుండా ఇతర అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌ లాంటి ఉగ్ర సంస్థల నిర్మూలనకు పాకిస్తాన్‌ను ఒప్పించేందుకు ఇంకా ఎన్నో మార్గాలున్నాయని ఉన్నతాధికారి చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top