మరో ఎటాక్కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్ | White House Says Syria's Assad Preparing Another Chemical Attack, Warns Of 'Heavy' Penalty | Sakshi
Sakshi News home page

మరో ఎటాక్కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్

Jun 27 2017 11:22 AM | Updated on Sep 5 2017 2:36 PM

మరో ఎటాక్కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్

మరో ఎటాక్కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్

మరోమారు మరో ఘోర రసానియ దాడికి సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిద్ధమవుతున్నట్టు వైట్ హౌజ్ పేర్కొంది.

రసాయనిక దాడులతో సిరియాను రక్తసిక్తం చేస్తున్నారు. మరోమారు మరో ఘోర రసానియ దాడికి సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిద్ధమవుతున్నట్టు వైట్ హౌజ్ పేర్కొంది. ఒకవేళ ఆయన ఈ దాడికి పాల్పడితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం రాత్రి విడుదల చేసిన వైట్ హౌజ్ ప్రకటనలో సిరియా అధ్యక్షుడికి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ లో రసాయనిక దాడికి పాల్పడే ముందు చేపట్టిన సన్నాహాలు మాదిరే, సిరియాలో ప్రస్తుతం మరో కెమికల్ దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించినట్టు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు. అసద్ పరిపాలనలో మరో భారీ రసాయనిక వాయువుల దాడి జరుగబోతుందని, ఇది భారీ మొత్తంలో ప్రజలను బలితీసుకోనుందని తెలిపారు.
 
ఇదే రకమైన కార్యకలాపాలు 2017 ఏప్రిల్ 4 కు ముందు కూడా చేపట్టారని పేర్కొన్నారు. ఒకవేళ రసాయనిక ఆయుధాలతో ప్రజల ప్రాణాలను బలిగొనే ఎటాక్ ను చేపడితే, ఆయన, ఆయన సైన్యం భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పైసర్ హెచ్చరించారు. ఏప్రిల్ లో జరిగిన ఎటాక్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. వెంటనే అసల్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ పై దాడులు చేపట్టారు. ఏప్రిల్ లో జరిగిన రసాయనిక దాడిలో ముక్కుపచ్చరాలని పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువగా ఏ పాపం తెలియని చిన్నారులే ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement