
వాతావరణం వల్లే ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం
ఎయిర్ ఏషియా విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణం ముఖ్య కారణమని ఇండోనేసియా వాతావరణ సంస్థ తెలియజేసింది.
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణం ముఖ్య కారణమని ఇండోనేసియా వాతావరణ సంస్థ తెలియజేసింది. ప్రమాదం జరగడానికి ముందు పైలట్ నుంచి సమాచారాన్ని విశ్లేషించి నిర్ధారణకు వచ్చింది.
ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల విమానం ఇంజిన్ చెడిపోయిఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ఇదీ ఒక కారణమని, అయితే విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణమేంటన్నది తేలాల్సివుందని వెల్లడించింది.