ఆకారం చూసి ఓటేయ్! | Watch you weight if contesting elections | Sakshi
Sakshi News home page

ఆకారం చూసి ఓటేయ్!

May 21 2014 2:50 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల శారీరక రూపం కూడా వారి గెలుపోటములను ప్రభావితం చేయగలదంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.

వాషింగ్టన్: ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కువ ఓట్లు సంపాదించుకోవాలంటే... అందుకోసం అభ్యర్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు! మన దేశంలో అభ్యర్థులకు ఓటు వేసే విషయంలో కులం, ధనం, మతం ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయని తెలిసిందే. అయితే, అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల శారీరక రూపం కూడా వారి గెలుపోటములను ప్రభావితం చేయగలదంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే, 2008, 2012లో అమెరికా సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో గణాంకాలను అధ్యయనం చేయగా, ఆశ్చర్యకరంగా ఇదే విషయం వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయులైన అభ్యర్థులు, సన్నగా ఉండే ప్రత్యర్థుల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నట్లు స్పష్టమైంది.

ఓటింగ్ విధానంపై అధిక బరువు గణనీయమైన ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ రోహ్లింగ్ తెలిపారు. రోహ్లింగ్, తన భార్య పాట్రీసియాతో కలసి ఈ అధ్యయనం నిర్వహించారు. అభ్యర్థుల ఆకారాల్లో ఎక్కువ తేడా ఉన్నప్పుడు, వారికి పోలయ్యే ఓట్లలోనూ అదే స్థాయిలో తేడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అంటే, ఇద్దరు ప్రత్యర్థుల్లో లావుగా ఉన్న వ్యక్తి కంటే సన్నగా ఉన్న వ్యక్తికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయట. దీన్నిబట్టి చూస్తే అమెరికాలో ఓటర్ల ఆదరణ చూరగొనాలంటే సన్నగా ఉండడం కూడా ముఖ్యమేనని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement