క‌రోనా: ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత మ‌ళ్లీ గెలిచాడు | Sakshi
Sakshi News home page

క‌రోనాను జ‌యించిన‌ 99 ఏళ్ల వృద్ధుడు

Published Wed, Apr 15 2020 1:01 PM

Viral: 99 Year Old Who Fought In World War II Beats Coronavirus In Brazil - Sakshi

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ల్లో ప్రాణాల‌ను హ‌రిస్తూ ప్ర‌పంచ దేశాల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. మ‌నుషుల్లో భ‌యం అనే బీజాల‌ను నాటింది. అయితే ఇది కూడా సాధార‌ణ జ‌బ్బులాంటిదేన‌ని, ధైర్యంతో దీన్ని జ‌యించ‌వ‌చ్చని తొంభైతొమ్మిదేళ్ల వృద్ధుడు నిరూపించాడు. ఈ అద్భుత ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఎర్మాండో పివేటా రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో బ్రెజిల్ ఫిరంగిద‌ళంలో సేవ‌లందించాడు. ఆయ‌న మిత్ర దేశాల త‌ర‌పున పోరాటం కొన‌సాగించాడు. రెండ‌వ లెఫ్టినెంట్‌గా ప‌ని చేసిన ఆయ‌న ఈమ‌ధ్యే క‌రోనా బారిన ప‌డ్డాడు. కానీ యుద్ధాన్నే జ‌యించిన అత‌నికి క‌రోనా బెదిరిపోయింది. ఎనిమిది రోజుల చికిత్స అనంత‌రం క‌రోనా నుంచి బ‌య‌ట‌పడ్డాడు. (వేతన ఫిర్యాదుల పరిష్కారానికి 20 కంట్రోల్‌ రూమ్‌లు)

ఆర్మీ క్యాప్ ధ‌రించిన ఆయ‌న ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ్తుండ‌గా అధికారులు సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఆర్మీ అధికారులు స్పందిస్తూ.. అత‌ను మ‌రో యుద్ధాన్ని జ‌యించాడ‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 1914 జూలై 28 నుంచి 1918 న‌వంబ‌ర్‌‌‌ వ‌ర‌కు కొన‌సాగిన మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ర‌ష్యా దేశాల‌తో కూడిన మిత్ర‌రాజ్యాలు విజ‌యం సాధించాయి. జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, హంగ‌రీ, ఇట‌లీ దేశాలు ఓడిపోయాయి. 1939 సెప్టెంబ‌ర్ 1 నుంచి 1945 సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు కొన‌సాగిన రెండో ప్ర‌పంచ యుద్ధంలోనూ మిత్ర‌రాజ్యాలే గెలుపొందాయి. (అమ్మా వ‌చ్చేయ‌మ్మా : న‌ర్సు కూతురి కంట‌త‌డి)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement