ఇలా పడుకోవాలంటే దమ్ముండాలి | Views for the bravest! Intrepid Chinese tourists camp on narrow mountain walkway 3,300ft above the ground | Sakshi
Sakshi News home page

ఇలా పడుకోవాలంటే దమ్ముండాలి

Jul 20 2016 10:21 AM | Updated on Sep 4 2017 5:29 AM

ఇలా పడుకోవాలంటే దమ్ముండాలి

ఇలా పడుకోవాలంటే దమ్ముండాలి

అది మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోగల లాజున్ అనే పర్వత ప్రాంతం.. ఎత్తు మూడువేల అడుగుల పైనే.. అక్కడి నుంచి కిందికి చూస్తేనే గుండెలు జారీ పడతాయి..

బీజింగ్: అది మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోగల లాజున్ అనే పర్వత ప్రాంతం.. ఎత్తు మూడువేల అడుగుల పైనే.. అక్కడి నుంచి కిందికి చూస్తేనే గుండెలు జారీ పడతాయి.. నిటారుగా ఉండే ఈ పర్వతానికి వేలాడినట్లుగా ఓ ఆరడుగుల వెడల్పులో కాలినడక మార్గం ఏర్పటుచేశారు. అది కూడా కొండను తొలిచి సిమెంటు పిల్లర్లు నిర్మించి. భూమి మీద కట్టే నిర్మాణాల్లో ఉండటానికే అదిరిపడుతుంటాం.

అలాంటిది దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో కింద బలమైన ఆధారం లేకుండా.. అడ్డంగా నిర్మించిన పిల్లర్ల ద్వారా వేలాడుతున్నట్లుగా నిర్మించిన ఈ నిర్మాణంపై గుడారాలు వేసుకొని నిద్రిస్తే ఎలా ఉంటుంది. చైనాలోని దాదాపు చాలామంది పర్యాటకులు ఇదే చేశారు. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి విందు ఆరగించి నిద్రపోవడం వారికి ఆనవాయితీ అంట. దాదాపు 6,562 అడుగుల పొడవు నిర్మించిన ఈ కృత్రిమ చూరులాంటి దానిపై దాదాపు 10వేల మంది నిద్రించి హావ్... అని ఆవలిస్తూ నిద్రమేల్కొని సూర్యోదయాన్ని వీక్షించారు.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement