వీడియో పోలీస్... | Video of police ... | Sakshi
Sakshi News home page

వీడియో పోలీస్...

May 10 2014 3:18 AM | Updated on Sep 2 2017 7:08 AM

వీడియో పోలీస్...

వీడియో పోలీస్...

ఈయన లండన్‌లో గస్తీ తిరిగే ఓ పోలీస్ కానిస్టేబుల్. కుర్రాడు స్మార్ట్‌గా ఉన్నాడు కదా..! కానీ మనం చెప్పుకోబోయేది అతగాడి గురించికాదు.

 ఈయన లండన్‌లో గస్తీ తిరిగే ఓ పోలీస్ కానిస్టేబుల్. కుర్రాడు స్మార్ట్‌గా ఉన్నాడు కదా..! కానీ మనం చెప్పుకోబోయేది అతగాడి గురించికాదు. అతడి కుడి భుజం దగ్గర ఉన్నదే ఓ అగ్గిపెట్టెలాంటి పరికరం.. దాని గురించే. ఈ పెట్టె ధరించడం ద్వారా ఆధారాలు సులభంగా దొరుకుతాయని, బాధితులకు న్యాయం త్వరగా అందుతుందని, పోలీసుల్లో అవినీతి తగ్గుతుందని మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ విభాగం నమ్ముతోంది.

ఆ నమ్మకంతోనే నగరంలో పైలట్ ప్రాజె క్టు కింద పలువురు పోలీ సులకు వీటిని తగిలిం చింది. ఇంతకీ టేజర్ కంపెనీ తయారు చేసిన ఈ పెట్టె ఏంటంటారా.. ఇదొక బాడీ కెమెరా. ఇది తగిలించుకున్న పోలీసు.. నేర ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రతి అంశాన్నీ ఇది వీడియో తీస్తుంది. వీడియోతోపాటే ఆడియో కూడా రికార్డైపోతుంది. ఫలితంగా కేసు విచారణ దశలో ఎలాంటి ఆధారాలూ మిస్ కాకుండా ఉంటాయని వీటిని ప్రవేశపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement