అమెరికా అధ్యక్ష భవనంలో కలకలం.. | us Secret Service agents search operation in White House | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష భవనంలో కలకలం..

Mar 28 2017 9:26 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా అధ్యక్ష భవనంలో కలకలం.. - Sakshi

అమెరికా అధ్యక్ష భవనంలో కలకలం..

అమెరికా అధ్యక్ష భవనంలో ఓ బ్యాగు కలకలం రేపింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనంలో ఓ బ్యాగు కలకలం రేపింది. వైట్ హౌస్ భవనంలో పనిచేసే సిబ్బంది దక్షిణం వైపున్న ప్రాంతంలో ఓ బ్యాగును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన వారు  ఆ అనుమానిత బ్యాగుతో పాటు అధ్యక్ష భవనంలో అణువణువు క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులెవరైనా వైట్‌హౌస్‌లోకి చొరబడి ఉండొచ్చునని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

ఇటీవల బ్రిటన్ లోని లండన్ నగరంలో పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని తామే చేసినట్లు స్థానిక ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వైట్‌ హౌస్‌లో సిబ్బందికి తెలియకుండా అనుమానిత వస్తువు కనిపించడంతో కాస్త కలకలం రేగింది. భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement