భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా | US, India Military Relationship Closest Ever: American Defence Secretary | Sakshi
Sakshi News home page

భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా

Sep 30 2016 12:48 PM | Updated on Aug 24 2018 4:57 PM

భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా - Sakshi

భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా

భారత్-అమెరికాల సైనిక విభాగం విషయంలో ఎప్పటికీ చాలా అన్యోన్యమైన సంబంధం ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ అన్నారు.

వాషింగ్టన్: భారత్-అమెరికాల సైనిక విభాగం విషయంలో ఎప్పటికీ చాలా అన్యోన్యమైన సంబంధం ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ అన్నారు. తమ రెండు దేశాలు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాలని కొనియాడారు. వ్యూహాత్మక విషయాల్లో, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పుడో చేతులుకలిపామని అన్నారు. ఉపరితల, గగనతల, సముద్రంపైనా తొలిసారి ఇరు దేశాలు కలిసి విన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

'అమెరికా వివిద ప్రాంతాల మధ్య స్థానిక భాగస్వామ్యాలు పెరగడమే కాదు.. మరింతగా బలపడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ అమెరికాల మధ్య మిలటరీ సంబంధాలు బలపడ్డాయి. భారత్ గొప్ప దేశం. పెద్ద ప్రజాస్వామ్యం గలది' అంటూ ఆయన కొనియాడారు. 'భారత్ అమెరికా మధ్య ఒక్క సైనిక ఒప్పందాలే కాదు.. సాంకేతిక పరిజ్ఞానపరమైన ఒప్పందాలు కూడా జరిగాయి. మోదీ మేకిన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో భాగంగా మా దేశాలకు కూడా సైనిక పరమైన అవసరాల విషయంలో, క్షిపణి వ్యవస్థ విషయంలో సహకారం చేసుకునే అవకాశం వచ్చింది' అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement