బ్లేళ్లు, కత్తులతో.. చర్చిలో దుండగుల అలజడి | two people with knives take several into hostage from france church | Sakshi
Sakshi News home page

బ్లేళ్లు, కత్తులతో.. చర్చిలో దుండగుల అలజడి

Jul 26 2016 3:10 PM | Updated on Sep 4 2017 6:24 AM

కేవలం బ్లేడులు, కత్తులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫ్రాన్స్లోని ఓ చర్చిలో అలజడి సృష్టించారు.

కేవలం బ్లేడులు, కత్తులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫ్రాన్స్లోని ఓ చర్చిలో అలజడి సృష్టించారు. ఉత్తర ఫ్రాన్స్ లోని నార్మండి ప్రాంతంలో గల చర్చిలోకి ప్రవేశించి, పలువురిని బందీలుగా తీసుకున్నారు. బందీలలో ఒకరిని వాళ్లు చంపినట్లు కూడా తెలుస్తోంది. చర్చిలోపల సరగ్గా ఎంతమంది ఉన్నదీ తెలియదు గానీ, లోపలి వారిని మాత్రం వాళ్లు బంధించారని పోలీసులు అంటున్నారు.

ఐదారుగురిని బంధించినట్లు మరికొందరు చెబుతున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల రోడ్లన్నింటనీ దిగ్బంధించారు. ముందుజాగ్రత్తగా అంబులెన్సులను కూడా అక్కడకు తరలించారు. బందీలలో ఒక పాస్టర్, ఇద్దరు నన్లు, ఇద్దరు భక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని బీఎఫ్ఎం టీవీ తెలిపింది.

కాగా, కాసేపటి తర్వాత ఇద్దరు దుండగులను పోలీసులు కాల్చి చంపారు. అంతకుముందు చర్చి ఫాదర్ ను ఆ దుండగులు చంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement