చైనాలో భూకంపం | Two dead as 6.3 magnitude earthquake hits China | Sakshi
Sakshi News home page

చైనాలో భూకంపం

Nov 23 2014 11:27 AM | Updated on Sep 2 2017 4:59 PM

చైనాలో భూకంపం

చైనాలో భూకంపం

చైనాలోని సిచియన్ ప్రావెన్స్లో భూకంపం సంభవించింది.

బీజింగ్: చైనాలోని సిచియన్ ప్రావెన్స్లో భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ఇద్దరు మరణించగా.... 54 మంది గాయపడ్డారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులను ఉన్నతాధికారులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని తెలిపింది. కాగా వారిలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని... వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొంది.

అలాగే మిగిలిన 43 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పింది. టగాన్ పట్టణం సమీపంలో శనివారం సాయంత్రం ఈ భూకంపం సంభవించిందని... దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైందని మీడియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement