వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్ల క్లోజ్‌

Twitter Removes Thousands Of Fake Accounts - Sakshi

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ సంస్థ వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్లను శుక్రవారం తొలగించింది. సౌదీ అరేబియాలో యుద్ధం అంటూ సౌదీకి అనుకూలంగా తప్పుడు సమాచారం శుక్రవారం ట్విటర్‌లో వైరల్‌ కావడంతో ట్విటర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా హాంకాంగ్‌లో ఆందోళనల గురించి చైనా నుంచి వస్తున్న పోస్టులకు సంబంధించిన అకౌంట్లను కూడా ట్విటర్‌ రద్దు చేసింది. ఇంకా స్పెయిన్, ఈక్వెడార్‌లోని అదనపు ఫేక్‌ అకౌంట్లను తొలగించింది.  హాంకాంగ్‌ నిరసనకారుల గురించి పోస్టులు పెడుతున్న 4302 నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు ట్విటర్‌ వెల్లడించింది. హాంకాంగ్‌లో నిరసనలపై పోస్టులు పెట్టిన చైనా చెందిన 2 లక్షల నకిలీ ఖాతాలను గత ఆగస్టులో ట్విటర్‌ తొలగించింది. (చదవండి: ట్విటర్‌ సీఈవో అకౌంట్‌ హ్యాక్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top