అంటార్కిటికాలో భారీ ఐస్‌బర్గ్‌ బద్దలు..టెన్షన్‌ | Trillion-Tonne Iceberg Breaks Off Antarctica: Report | Sakshi
Sakshi News home page

అంటార్కిటికాలో భారీ ఐస్‌బర్గ్‌ బద్దలు..టెన్షన్‌

Jul 12 2017 4:55 PM | Updated on Sep 5 2017 3:52 PM

అంటార్కిటికాలో భారీ ఐస్‌బర్గ్‌ బద్దలు..టెన్షన్‌

అంటార్కిటికాలో భారీ ఐస్‌బర్గ్‌ బద్దలు..టెన్షన్‌

అంటార్కిటిక్‌లో మరో పెనుమార్పు చోటు చేసుకుంది.

పారిస్‌: అంటార్కిటిక్‌లో మరో పెనుమార్పు చోటు చేసుకుంది. మునుపెన్నడూ లేనంత భారీ పరిమాణంలోని ఐస్‌బర్గ్‌ బద్దలైంది. సోమవారం, బుధవారం మధ్య ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు ప్రస్తుతం అంటార్కిటిక్‌లో చోటుచేసుకుంటున్న మార్పులను పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 5800 చదరపు కిలోమీటర్ల భారీ స్థాయిలో విస్తీర్ణం కలిగిన లార్సెన్‌ సీ అనే మంచుపలక ఎట్టకేలకు ప్రధాన విభాగం నుంచి విడిపోయినట్లు వెల్లడించారు.

స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం దీని బరువు ట్రిలియన్‌ టన్నులు ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్‌ అమెరికాలోని డెలావర్‌ అనే చిన్న రాష్ట్రంతో సమానం అని, ఎరీ అనే సరస్సుకంటే రెండింతలు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన విభాగం నుంచి విడిపోయిన ఈ భారీ మంచు కొండ అప్పుడే కరగడం ప్రారంభించిందని, అది 12 శాతం తగ్గిందని, ఫలితంగా దీనికి సమీపంలోని సరస్సుల్లో ప్రవాహం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సముద్రంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే వివరాలు ఇప్పుడప్పుడే చెప్పలేమంటూ తెలిపారు.

Advertisement
Advertisement