డ్రగ్స్ స్మగ్లర్ల కాల్పులు: ముగ్గురు పోలీసులకు గాయాలు | Three police officers injured in Chicago shooting | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ స్మగ్లర్ల కాల్పులు: ముగ్గురు పోలీసులకు గాయాలు

Mar 15 2016 1:35 PM | Updated on May 25 2018 2:29 PM

అమెరికాలోని చికాగాలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు.

వాషింగ్టన్: అమెరికాలోని చికాగాలో డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు) స్మగ్లింగ్ ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నగరంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు సోమవారం రాత్రి పోలీసులు యత్నించారు. దాంతో పోలీసులపై ఆ ముఠా సభ్యులు కాల్పులు జరిపారు.

వెంటనే పోలీసులు కూడా ప్రతిదాడిగా ఎదురుకాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో గాయాలపాలైన పోలీసులు అధికారులను ఆస్పత్రికి తరలించినట్టు పోలీస్ శాఖ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై చికాగో మేయర్ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దుండగుల దాడిని ఎదుర్కొన్న పోలీసు అధికారులను ప్రశంసించింది. పోలీసుల కాల్పుల్లో అనుమానితులు ఇద్దరు స్మగ్లింగ్ ముఠా సభ్యులు మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement