పర్యాటకులకు అత్యంత ప్రమాదకర దేశాలివే! | The most dangerous countries to visit in the world | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు అత్యంత ప్రమాదకర దేశాలివే!

Mar 2 2017 11:17 AM | Updated on Sep 5 2017 5:01 AM

సౌసీ మృతులకు సంతాపం తెలుపుతున్న మహిళ(ఫైల్‌ ఫోటో)

సౌసీ మృతులకు సంతాపం తెలుపుతున్న మహిళ(ఫైల్‌ ఫోటో)

సౌసీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 38 మంది మృతి చెదిన విషయం తెలిసిందే.

లండన్‌: రెండేళ్ల క్రితం ట్యునీషియాలోని సౌసీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కాల్పులు జరపడంతో 38 మంది మృతి చెదిన విషయం తెలిసిందే. విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిపిన క్రూరమైన దాడుల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ ఘటన అనంతరం.. పర్యాటకులకు ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించే చర్యలు పెరిగాయి.

పర్యాటకులపై దాడులు, కిడ్నాప్‌లు, స్థానికంగా ఉన్న అశాంతి, విపత్తులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్సీఓ(ద ఫారెన్‌ అండ్‌ కామన్వెల్త్‌ ఆఫీస్‌) క్రమం తప్పకుండా పర్యాటకులకు ప్రమాదకరమైన దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఇటీవలి ఈ జాబితాలో సెంట్రల్‌ ఆఫ్రికన్ రిపబ్లిక్‌, లిబియా, దక్షిణ సూడాన్‌, సిరియా, ఎమెన్‌ దేశాల్లోని అన్నిప్రాంతాల్లో పర్యాటకులకు తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని ఎఫ్సీఓ వెల్లడించింది.

మరో 32 దేశాల్లోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు హానికరమని తెలుపుతూ విడుదల చేసిన జాబితాలో.. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, ఈజిప్ట్‌, జార్జియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఇరాన్‌, మాలి, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement