breaking news
dangerous countries
-
పర్యాటకులకు అత్యంత ప్రమాదకర దేశాలివే!
లండన్: రెండేళ్ల క్రితం ట్యునీషియాలోని సౌసీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కాల్పులు జరపడంతో 38 మంది మృతి చెదిన విషయం తెలిసిందే. విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిపిన క్రూరమైన దాడుల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ ఘటన అనంతరం.. పర్యాటకులకు ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించే చర్యలు పెరిగాయి. పర్యాటకులపై దాడులు, కిడ్నాప్‌లు, స్థానికంగా ఉన్న అశాంతి, విపత్తులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్సీఓ(ద ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్) క్రమం తప్పకుండా పర్యాటకులకు ప్రమాదకరమైన దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఇటీవలి ఈ జాబితాలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, ఎమెన్ దేశాల్లోని అన్నిప్రాంతాల్లో పర్యాటకులకు తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని ఎఫ్సీఓ వెల్లడించింది. మరో 32 దేశాల్లోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు హానికరమని తెలుపుతూ విడుదల చేసిన జాబితాలో.. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఈజిప్ట్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్, మాలి, ఫిలిప్పీన్స్ తదితర దేశాలున్నాయి. -
మన దేశం గురించి నమ్మలేని నిజం
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో 3వ స్థానంలో భారత్ 1,2 స్థానాల్లో ఇరాక్, పాకిస్థాన్ 2013లో భారత్‌లో 212 బాంబు పేలుళ్లు 2013లో భారత్‌లో బాంబు దాడి మృతుల సంఖ్య 130 2004 -2013 మధ్య భారత్‌లో 298 మందుపాతర పేలుళ్లు 2004 -2013 మధ్య భారత్‌లో మరణాలు - 1,337 ఇరాక్, పాక్, భారత్‌లలోనే 75 శాతం పేలుళ్లు! మన దేశం గురించి మీరు ఇప్పుడు ఒక నమ్మలేని నిజం తెలుసుకోబోతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో మన దేశం పేరు కూడా ఉంది. భారతీయుడిగా బాధపడవలసిన వార్త ఇది. నిత్యం బాంబుదాడులతో దద్దరిల్లే ఆఫ్ఘనిస్థాన్, సిరియాకన్నా మనం మరింత ప్రమాదకరస్థితిలో ఉన్నామని ప్రభుత్వ నివేదికే వెల్లడిస్తోంది. ఈ విషయంలో ఇరాక్, పాకిస్తాన్ తర్వాత స్థానం మనదే కావడం ఆందోళనకలిగించే అంశం. బౌద్ధం పుట్టిన భూమిపై బాంబులు పేలడం బాధాకరం. ఎప్పుడు ఏ బాంబు పేలి మరణాలు సంభవిస్తాయో తెలీని ప్రమాదకర వాతావరణం భారత్‌లోనే ఎక్కువగా ఉందని నేషనల్ బాంబ్ డాటా సెంటర్ (ఎన్బిడిసి) నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఇలాంటి వాతావరణమున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. నిరంతరం బాంబుదాడులు, పేలుళ్లు జరిగే ఇరాక్, పాకిస్థాన్ తొలి రెండు స్థానాల్లో ఉండగా తర్వాతి స్ధానంలో భారత్ ఉంది. ఉగ్రవాదుల బాంబు దాడులు, మావోయిస్టుల పేలుళ్లు భారత్‌లో నిత్యకృత్యమయ్యాయి. దీంతో మరణాల సంఖ్య కూడా ఊహించనంత ఉంటోంది. ఒక్క 2013లోనే భారత్‌లో 212 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ సంఖ్య తాలిబన్లు అత్యంత యాక్టివ్‌గా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ కన్నా రెట్టింపు. 2012తో పోలిస్తే బాంబు పేలుళ్లు, దాడుల సంఖ్య తగ్గినా భారత్‌లో ఇప్పటికీ ఆందోళనకర పరిస్థితే ఉంది. 2013లో జరిగిన బాంబు పేలుళ్లు, దాడుల్లో మన దేశంలో 130 మంది చనిపోయారు. దాదాపు 5 వందల మంది గాయపడ్డారు. గడచిన దశాబ్ధంలో అంటే 2004 నుంచీ 2013 వరకూ భారత్‌లో 298 మందుపాతర పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 1,337 మంది చనిపోయారు. ప్రపంచంలో జరుగుతున్న 75 శాతం పేలుళ్లు భారత్, పాక్, ఇరాక్‌లోనే జరుగుతున్నాయని ఎన్బిడిసి నివేదికలో పేర్కొన్నారు. ప్రజలు లక్ష్యంగా జరిగే దాడులు భారత్‌లో 58 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 69 శాతం ఉంది. భద్రతా దళాలు, ప్రభుత్వ ఆస్తుల పైనా దాడులు కొనసాగుతున్నాయి. అప్రమత్తత కారణంగా భద్రతా దళాలు తమపై దాడుల సంఖ్యను 40 శాతం మేరకు తగ్గించుకోగలిగాయి. అయితే ప్రజలపై జరుగుతున్న దాడులపై మాత్రం ఈ అప్రమత్తత లేదనేది సుస్పష్టంగా తెలుస్తోంది. భారత్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోనూ, మావోయిస్టు ప్రభావిత బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 80 శాతం మందు పాతర పేలుళ్లు జరుగుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో బాంబు దాడి ఘటనలు 50 శాతం మేర పెరిగాయి. నివేదిక వివరాలు చూస్తుంటే సగటు భారతీయుడికి వర్తమానంతో పాటు భవిష్యత్ భారతంపై ఆందోళన కలగకమానదు. ఈ నేపధ్యంలో అప్రమత్తతతో పాటు ఉగ్రవాదుల, మావోయిస్టుల కదలికలను కనిపెట్టగలిగే వ్యవస్థలను రూపొందించడం అత్యవసరమని రక్షణ, భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. దాడులకు సంబంధించి పథక రచన సమయంలోనే గుర్తించి కుట్రలను విఫలం చేయగలగడం, దాడులను సమర్థంగా తిప్పికొట్టగలగడం అతి ముఖ్యమంటున్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే విషయంలో ఇజ్రాయిల్ లాంటి దేశాలు అనుసరిస్తోన్న మార్గాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశ రక్షణ, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వాలు రాజీపడకుండా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని ఫణంగా పెట్టవద్దని కోరుతున్నారు.