బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి | Terror in Burkina Faso: Al Qaeda gunmen kill 22 including foreigners at two top tourist hotels | Sakshi
Sakshi News home page

బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి

Jan 17 2016 3:53 AM | Updated on Aug 17 2018 7:36 PM

బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి - Sakshi

బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగాలో శనివారం ఓ స్టార్ హోటల్‌పై అల్ కాయిదా ఉగ్రవాదులు తెగబడ్డారు.

26 మంది మృతి
ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగాలో శనివారం ఓ స్టార్ హోటల్‌పై అల్ కాయిదా ఉగ్రవాదులు తెగబడ్డారు. 26 మంది పౌరులను కాల్చి చంపారు.  భద్రతా దళాలు... ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి 126 మందిని వారి చెర నుంచి రక్షించాయి. వీరిలో 33 మంది గాయపడ్డారు. తొలుత స్ప్లెన్‌డిడ్ ఫోర్ స్టార్ హోటల్, అనంతరం సమీపంలోని కాపుసినో రెస్టారెంట్‌పై దాడి చేసిన జీహాదీలు అందులోని వారిని బంధించారు. దగ్గర్లోని మరో హోటల్ వైబి నెక్ట్స్‌లో దాడి కొనసాగుతోందని ఆ దేశ మంత్రి  కంపోర్ చెప్పారు.

ఫ్రాన్స్ ప్రత్యేక దళాల సహకారంతో తమ భద్రతా దళాలు హోటల్‌లో గాలిస్తున్నాయన్నారు. దాడి నుంచి తప్పించుకున్నవారిలో కార్మిక శాఖ మంత్రి సవడోగో కూడా ఉన్నారన్నారు. ‘తెల్లవారుజామున హోటల్ ముఖ ద్వారం వద్ద కాల్పుల శబ్దం వచ్చింది.బయటనున్న దాదాపు పది వాహనాలను ఉగ్రవాదులు తగులబెట్టారు. ఆ సమయంలో అంతా నిద్రపోతున్నారు. వారిపై కాల్పులు జరిపారు’ అని యానిక్ చెప్పారు. అల్ కాయిదా అనుబంధ సంస్థ ఇస్లామిక్ మఘ్‌రెబ్ ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. మృతుల్లో నలుగురు విదేశీయులున్నారు.

భారతీయుడు క్షేమం!
బుర్కినా ఫాసోలోని హోటల్‌లో ఉగ్రవాదుల చెరలో చిక్కిన 126 మంది బందీలలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. భద్రతా దళాల ఆపరేషన్‌తో ఆ భారతీయుడు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. బుర్కినా ఫాసోలో ఉన్న గౌరవ్‌ గార్గ్‌ అనే వ్యక్తి.. తన మిత్రుడు విరాజ్‌ ఉగ్రవాదులు చొరబడిన స్ప్లెన్‌డిడ్‌ హోటల్‌లో చిక్కుకుపోయినట్టు మొదట ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. సైనికుల ఆపరేషన్ తర్వాత అతను క్షేమంగా బయటపడినట్టు వెల్లడించాడు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement