సొలొమన్ దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభంవించింది.
సిడ్నీ: సొలొమన్ దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8 గా నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. సునామీ వచ్చే హెచ్చరికలు లేవు. రాజధాని హనియర్కు 448 కిలో మీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. గత మూడు రోజుల నుంచి మూడోసారి భూమి కంపించింది.