వాటర్‌ బాటిల్‌ వెనుక ఇంత కథ ఉందా!!

Story behind the water bottle - Sakshi

ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణమవుతున్నామంటే వెంట నీళ్లు తప్పనిసరిగా తీసుకెళ్లడం మర్చిపోయేవారు కాదు. మరి ఇప్పుడు.. ఎక్కడపడితే అక్కడ వాటర్‌ బాటిళ్లు దొరుకుతున్నాయి. కొనేస్తున్నారు.. తాగేస్తున్నారు! తాగునీరు చాలాచోట్ల అందుబాటులో ఉన్నా కూడా వాటర్‌ బాటిళ్లనే కొంటున్నారు. ఎందుకు? దీనిపై కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్‌ కోట్‌ అనే గ్రాడ్యుయేట్‌ విద్యార్థి పరిశోధన చేసి,  వెల్లడించిన వివరాలు ఇవిగో.. ఓసారి చదివేయండి!

ఎప్పుడైనా టీవీల్లో వాటర్‌ బాటిల్‌ యాడ్‌ చూశారా? చూసినా.. మీరు బహుశా పెద్దగా గమనించి ఉండరు. ఎందుకంటే, ఆ యాడ్‌ మీలో లేనిపోని భయాన్ని సృష్టిస్తోంది. బ్రాండెడ్‌ కంపెనీల వాటర్‌ బాటిళ్లలోని నీళ్లు కాకుండా మరేవి తాగినా కోరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టే..అనేంతగా మనల్ని ట్యూన్‌ చేస్తాయి. వీటిని చూసిన సాధారణ జనం.. రిస్కెందుకు, కొనేదేదో బ్రాండెడ్‌ కంపెనీల నీళ్ల సీసాలనే కొని, తాగేస్తే పోలా? అని వాటినే కొంటున్నారు.  

మరికొందరికి స్టేటస్‌ సింబల్‌..
తమ ఆహార్యం ద్వారా స్టేటస్‌ను చాటుకోవాలని అనుకునేవారు కూడా వాటర్‌ బాటిల్‌ ద్వారా ఆ పని చేస్తున్నారు. బ్రాండెడ్‌ కంపెనీల వాటర్‌ బాటిల్‌ను కొని, చేతిలో పట్టుకొని తమ డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు. నీళ్ల సీసా ద్వారా తమ ఫిట్‌నెస్‌ను, విలువను, ఫిజికల్‌ అప్పియరెన్స్‌ను, ఆర్థిక స్థితిని చాటుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఇదే వాటర్‌ బాటిల్‌తో దేశభక్తిని కూడా చాటుకోవాలనుకుంటున్నారు. ‘మనదేశపు నీళ్లు’ అనే అభిప్రాయంతో కొంటున్నవారు కూడా ఉన్నారు.

చెవికెక్కడంలేదు...
బాటిళ్లలోని నీళ్ల కంటే మున్సిపల్‌ నల్లా నీళ్లే మంచివనే విషయాన్ని అనేక స్వ చ్ఛంద సంస్థలు, నిపుణులు చెబుతున్నా ప్రజల చెవికి ఎక్కడంలేదు. నీళ్ల సీసా ల్లోని నీరు అంత సురక్షితమైనది కాదని చెప్పేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభు త్వ ఏజెన్సీలు కొత్తగా ఆలోచిం చాల్సిన అవసరముంది. ఆర్థిక, నైతిక, పర్యావరణ అంశాలను జోడిస్తూ ప్రచా రం చేస్తే కొంతమేరకైనా ఫలితముంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top