ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి

Stop Capital Punishment UN After Nirbhaya Convicts Hanging - Sakshi

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపివేయాలి. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. చదవండి: 'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి'

నిర్భయ దోషులను ఉరి తీసిన 24 గంటల తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్భయను సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. దేశంలో నలుగురిని ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరాస్‌ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు.కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఏర్పడలేదన్నారు. చదవండి: హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top