హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్! | Olga Kurylenko Splits From Boyfriend | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్‌ చెప్పిన ప్రియుడు!

Mar 21 2020 4:23 PM | Updated on Mar 21 2020 4:57 PM

Olga Kurylenko Splits From Boyfriend - Sakshi

ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె తెలిపింది. ఓల్గాకు కరోనా సోకడంతో ఆమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు ఇస్తోంది. అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఓల్గా చెప్పుకొచ్చింది.

విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని ఓల్గా చెప్పింది. కాగా ఆమె కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: రోనా బారిన పడ్డాను

Advertisement
 
Advertisement
Advertisement