స్టైలు స్టైలురా.. | Stailura style .. | Sakshi
Sakshi News home page

స్టైలు స్టైలురా..

Dec 22 2014 7:27 AM | Updated on Sep 2 2017 6:35 PM

స్టైలు స్టైలురా..

స్టైలు స్టైలురా..

ర్యాంప్‌పై అందాలభామలు హొయలు పోయినట్టు.. కళ్లద్దాలు పెట్టుకుని, డిజైనర్ దుస్తులు ధరించి ఈ శునకరాజం ఎంత ఠీవిగా నడుస్తోందో చూశారా..

ర్యాంప్‌పై అందాలభామలు హొయలు పోయినట్టు.. కళ్లద్దాలు పెట్టుకుని, డిజైనర్ దుస్తులు ధరించి ఈ శునకరాజం ఎంత ఠీవిగా నడుస్తోందో చూశారా.. రెండు కాళ్లపై నడవడమే దీని స్పెషాలిటీ. ఈ శునకం పేరు షియోను. తన యజమాని ఫాంగ్(62)తో కలసి రోజు నడుచుకుంటూ మార్కెట్‌కు వెళుతుంది. చైనాలోని షాంఘై సిటీలో డిసెంబర్ 19న షియోను మార్కెట్‌కు వెళుతుండగా తీసిన చిత్రమిది. మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన దొరికిన కుక్కపిల్లకు షియోను అని పేరుపెట్టి పెంచుకుంటున్నాడు ఫాంగ్. రెండు కాళ్లపై నడిచేలా తర్ఫీదునివ్వడంతో మనుషుల్లాగే నడిచేస్తోంది..
 

Advertisement
 
Advertisement
Advertisement