బాంబుపేలడానికి ముందు వీడియో.. బ్యాగుతో ఉగ్రవాది! | St Sebastian church bomb attack cctv video | Sakshi
Sakshi News home page

బాంబుపేలడానికి ముందు వీడియో.. బ్యాగుతో ఉగ్రవాది!

Apr 23 2019 12:24 PM | Updated on Apr 23 2019 12:37 PM

St Sebastian church bomb attack cctv video - Sakshi

సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు.

కొలంబో: శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చిన తర్వాత, బాంబుపేలడానికి ముందు నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయడం ఆగిపోయింది. ఆ వ్యక్తే ఆత్మహుతిదాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.


శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 310కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చితోపాటూ కొలంబోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చి, బట్టికలోవాలోని జియోన్‌ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్‌ గ్రాండ్, కింగ్స్‌బరీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థకు చెందిన 40 మందిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement