లిఫ్ట్లో కుక్క అలా ఎలా ఇరుక్కుంది? | Shocking moment dog is nearly hanged by a lift | Sakshi
Sakshi News home page

లిఫ్ట్లో కుక్క అలా ఎలా ఇరుక్కుంది?

May 2 2016 8:42 AM | Updated on Sep 29 2018 4:26 PM

లిఫ్ట్లో కుక్క అలా ఎలా ఇరుక్కుంది? - Sakshi

లిఫ్ట్లో కుక్క అలా ఎలా ఇరుక్కుంది?

ఓ మహిళ సమయ స్పూర్తితో.. సెకన్ల వ్వవధిలో ప్రాణాపాయ స్థితి నుంచి క్షేమంగా బయటపడింది ఓ శునకం.

ఓ మహిళ సమయ స్పూర్తితో.. సెకన్ల వ్వవధిలో ప్రాణాపాయ స్థితి నుంచి క్షేమంగా బయటపడింది ఓ శునకం. ఈ సంఘటన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ మహిళ తన కుమారుడితో లిఫ్ట్లోకి ప్రవేశించింది. సరిగ్గా డోర్లు మూసుకునే సమయంలో శునకం లోపలికి ప్రవేశించింది. అయితే లిఫ్ట్ లోపలవైపు కుక్క, బయటి డోర్ల మధ్యలో కుక్కను కట్టేసే తాడు కొక్కి ఇరుక్కుంది.

లిఫ్ట్ బయటవైపు ఉన్న కుక్క యజమాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. లిఫ్ట్ కిందకు వెళ్లడంతో  కుక్క లిఫ్ట్ డోర్లకు దగ్గరగా చేరుకుని తాడు లాగడంతో ఉరివేసిన దానిలా పైకి లేస్తూ వెళ్లింది.లిఫ్ట్లోపల ఉన్న మహిళ సమయ స్పూర్తితో వ్యవహరించి స్టాప్ బటన్ నొక్కడంతో చిన్న గాయాలతోనే కుక్కు చావు అంచులవరకు వెళ్లి బయటపడింది. చివరకు డోర్ చివరన పై భాగంలో ఆగిపోయింది. లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీలో ఈమొత్తం రికార్డయింది.ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement