అమెరికాలోని లాస్ ఎంజెలెస్ నగరంలో భూకంపం సంభవించింది.
లాస్ ఎంజెలెస్ లో భూకంపం
Mar 29 2014 1:55 PM | Updated on Aug 24 2018 7:34 PM
అమెరికాలోని లాస్ ఎంజెలెస్ నగరంలో భూకంపం సంభవించింది. తక్కువ తీవ్రత నమోదైన భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా డిస్నీలాండ్ లో రైడింగ్, ఇతర కార్యక్రమాలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా గ్యాస్ లీకైనట్టు, వాటర్ పైపులు పలిగిపోయాయని, ఇంట్లోని కొన్ని వస్తువులు షెల్ఫ్ నుంచి కింద పడ్డాయని స్థానికలు వెల్లడించారు.
ప్రాణానష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా డిస్నీలాండ్ ను మూసివేసినట్టు ఎన్ బీసీ4 చానెల్ తెలిపింది. లాస్ ఎంజెలెస్ కు 45 కిలోమిటర్ల దూరంలోని లా హంబ్రా సమీపంలో చోటు చేసుకుందని తెలిపారు. 1994లో లాస్ ఎంజెలెస్ చోటుచేసుకున్న భూకంప (6.7) ప్రమాదంలో 10 బిలియన్ల ఆస్తి నష్టం, 60 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement