భారత్‌ను అంతర్జాతీయ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించేందుకు అడ్డంకి ఎదురైంది.
వాషింగ్టన్: భారత్‌ను అంతర్జాతీయ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించేందుకు అడ్డంకి ఎదురైంది. ఎగుమతి నియంత్రణ నిబంధనలకు సంబంధించిన సవరణల బిల్లు అమెరికా సెనెట్‌లో ఆమోదం పొందలేదు. ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త భేటీని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతి రోజు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ నేషనల్ డిఫెన్స్ అధరైజేషన్ యాక్ట్(ఎన్‌డీఏఏ-17)కి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు.
ఒబామా, మోదీ చర్చల అనంతరం భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఎన్‌డీఏఏ 85-13 ఓట్లతో సెనేట్ ఆమోదం పొందినా.. కొన్ని కీలక సవరణలకు ఆమోదం లభించలేదు.