మహిళతో టిఫిన్‌ చేశారని అరెస్ట్‌ చేశారు!

Saudi Arabia Arrests A Man Over Breakfast Video With Woman - Sakshi

రియాద్‌(సౌదీ అరేబియా) : మహిళతో కలిసి అల్పహారం చేస్తూ వీడియో తీసుకున్నందుకు ఓ ఈజిప్టియన్‌ కటకటాలపాలయ్యాడు. సహుద్యోగిని అయిన సదరు మహిళతో ఆ వ్యక్తి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇదికాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సౌదీ అరేబియా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అది అభ్యంతకరమైన వీడియో అని అధికారులు ఆ ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతను పనిచేసే హోటల్‌కు సమన్లు కూడా పంపారు.

ఈ వీడియోలో ఇస్లామిక్‌ నికాబ్‌తో ఉన్న సదరు మహిళ ఆ వ్యక్తిని తాకుతూ చేయిపట్టుకుని వీడియో తీయసాగింది. ఇది సౌదీ సంప్రదాయలకు విరుద్దం కావడంతో ఈ వీడియోపై  తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సౌదీ ఆచారా సంప్రదాయాలు పాటించాలని దేశప్రజలకు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విజ్ఞప్తి చేసింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top