ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!

Santa App Sends Creepy Messages to Young Girl - Sakshi

క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించిన సాంటా క్లాస్‌ అనే మొబైల్‌ యాప్‌ అసభ్యకర సందేశాలను పంపిస్తోంది. పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను సర్‌ప్రైజ్‌ చేయడానికి తల్లిదండ్రులకు ఓ సాధనంగా ఉండేందుకు రూపొందించిన ఈ యాప్‌ వారికి లేని తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నార్త్‌ కరోలినాకు చెందిన ఓ కుటుంబం ఈ యాప్‌ బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ యాప్‌లో తన కూతురికి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని చూసి అవాక్కైంది. అష్లే అడామ్స్‌ 8 ఏళ్ల కూతురు ఎంతో కుతూహలంగా ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సాంటా యాప్‌లోకి వెళ్లింది.

‘హాయ్‌’  అని టైప్‌ చేసింది. అయితే ఆ మెసేజ్‌కు బదులుగా వచ్చిన సందేశాన్ని చూసి నిర్ఘాంతపోయింది. హాయ్‌ మెసేజ్‌ సాంటా ఫీచర్స్‌ ‘నువ్వేం డ్రెస్‌ వేసుకున్నావ్‌’ అనే జుగుప్సాకరమైన సందేశాన్ని పంపించింది. ఈ సందేశం చూసి తాను షాక్‌ గురయ్యానని ఆ చిన్నారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆ మొబైల్‌ తీసుకొని పలు ప్రశ్నలతో యాప్‌ పరీక్షించిన అష్లే.. యాప్‌ తీరుపై పోలీసులతో పాటు యాపిల్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే యాపిల్‌ కంపెనీ థర్డ్‌పార్టీ యాప్‌ అయిన సాంటాపై ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు. ఇక ఆ మధ్య అలెక్సా వర్చువల్‌ అసిస్టెంట్‌ ఇలానే బూతులు తిడుతోందని అమెజాన్‌కు ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: అలెక్సా బూతులు తిడుతోంది!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top