పాకిస్థాన్లో రష్యా దళాలు | Russian Troops Arrive In Pakistan For First Ever Joint Military Drill | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్లో రష్యా దళాలు

Sep 23 2016 7:59 PM | Updated on Sep 4 2017 2:40 PM

పాకిస్థాన్, రష్యాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు సంయుక్తంగా 'ఫ్రెండ్ షిప్ 2016' పేరుతో సంయుక్త డ్రిల్ను నిర్వహించనున్నాయి.

ఇస్లామాబాద్: పాకిస్థాన్, రష్యాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు సంయుక్తంగా 'ఫ్రెండ్ షిప్ 2016' పేరుతో సంయుక్త డ్రిల్ను నిర్వహించనున్నాయి. ఇందుకోసం రష్యా దళాలు శుక్రవారం పాకిస్థాన్ చేరుకున్నాయి. రేపటి నుంచి ఈ డ్రిల్ ప్రారంభం కానుంది. ఇందులో ఇరుదేశాల నుంచి 200 మంది సైనికులు పాల్గొంటారని, పాక్ తో సైనిక విన్యాసం కొనసాగించడం ఇది మొదటి సారని రష్యా మిలిటరీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

రెండు వారాలపాటు  ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి.గత పదిహేనేళ్లలో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు రష్యాలో పర్యటించి ఎమ్ఐ35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఎస్యు ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు కూడా పాక్ ప్రయత్నం చేస్తోందని అక్కడి మీడియా వెల్లడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement